మాల్దీవుల్లో మంట పెడుతోంది.. బికినీలో తాప్సీ రచ్చ!!

ఝుమ్మంది నాదం సినిమాతో తెరకు పరిచయమైన తాప్సీ.. ప్రస్తుతం నేషనల్ స్టార్. ఒకప్పుడు గ్లామర్ డాల్‌గా మాత్రమే చూసిన వారంతా ఆమెలో ఓ అద్భుతమైన నటిని చూస్తున్నాడు. బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇక తెరపై ఎంత రెబల్‌గా ఉంటుందో సోషల్ మీడియాలోనూ అంతే స్థాయిలో విరుచుకపడుతూ ఉంటుంది. సుశాంత్ సింగ్ కేసు,డ్రగ్స్ కేసు, కంగనా రనౌత్ ఇలా ఎన్నో రకాలుగా తాప్సీ కామెంట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చేది.

Taapsee Pannu Bikini Pics In Maldives,Taapsee Pannu
Taapsee Pannu Bikini Pics In Maldives,Taapsee Pannu

తాజాగా వీటన్నంటి నుంచి బయట పడి ఆనందంగా గడిపేందుకు మాల్డీవులకు చెక్కేసింది. తన సోదరి, స్నేహితులతో కలిసి మాల్దీవుల్లో రచ్చ రచ్చ చేస్తోంది. వెళ్లిన రెండు రోజుల్లోనే ఎన్నో సాహసాలను చేసింది. పెద్ద పెద్ద చేపలతో ఆడుకుంటోంది. ఇసుకలో గూళ్లు కడుతోంది. స్కూబా డైవింగ్ చేస్తోంది. ఇసుకలో బొమ్మలను గీస్తూ పోటీలు పెట్టుకున్నారు. అయితే ఈ క్రమంలోనే తాప్సీ హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు కిక్కిస్తోంది.

బికినీ ఫోటోలతో మాల్దీవుల్లోనూ హీటెక్కిపోయింది. సముద్రంలో జల కన్యలా తాప్సీ రచ్చ చేస్తోంది. అలా సేదతీరుతూ రచ్చ రచ్చ చేస్తోంది. ఇక ఇంకొన్ని రోజులు అక్కడే ఉండి.. ఇన్నాళ్లుగా ఇంటి పట్టునే ఉంటూ వచ్చిన ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని ఇలా తీర్చేసుకుంటోంది. తాప్సీ చేతుల్లో ప్రస్తుతం రష్మీ రాకెట్, హసీన్ దిల్రూబా, మిథాలీ రాజ్ బయోపిక్ చిత్రాలు ఉన్నాయి.