రాధిక ఆప్టే మనకు లెజెండ్, లయన్ వంటి చిత్రాలు టక్కున గుర్తుకు వస్తాయి. అయితే అంతకు ముందుకు రక్త చరిత్ర, ధోని వంటి చిత్రాల్లో నటించి మెప్పింది. ఈ భామ సినిమాలతో కాకుండా తన కామెంట్లతో మరింత ఫేమస్ అయింది. ఈమె చేసే బోల్డ్ కామెంట్లు సోషల్ మీడియాలో దుమారం రేపుతుంటాయి. ఇక ఈ భామ వెడ్డింగ్ ఘోస్ట్ అనే చిత్రంలో నగ్నంగా నటించి అందరికీ షాక్ ఇచ్చింది. లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ బోల్డ్ టీచర్‌గా నటించి కుర్రకారును ఫిదా చేసింది.
రాధిక సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు చూస్తే ఎవ్వరికైనా మతి పోవాల్సిందే. నిత్యం బికినీలు ధరించి, బీచ్‌లో అందాలను ఆరబోస్తుంటుంది. ఇక ఆమె అందాల ప్రదర్శనకు అంతే ఉండదు. ఆమె లవ్ స్టోరీ, డేటింగ్ వివరాలు, భర్త విదేశాల్లో ఉంటే నిత్యం అక్కడికి ఇక్కడికి ప్రయాణం చేయడం ఇలా తన వ్యక్తిగత వివరాలను చెబుతూ సెన్సేషన్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. తాజాగా పాయల్ ఘోష్ అనురాగ్ కశ్యప్‌పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాధిక.. అనురాగ్ మంచితనం గురించి చెబుతూ ఆ ఆరోపణలను పరోక్షంగా కొట్టిపారేసింది.
ఇక రీసెంట్‌గా పెగ్గు ఎలా కలపాలి? మందులో ఎంత సోడా పోయాలి? స్టఫ్ ఏది తీసుకోవాలో చెప్పింది. తాను మాత్రం అలానే తాగుతాను.. అదే తింటానని తెలిపింది. 50 ఎం ఎల్ జానీ వాకర్ స్కాచ్ విస్కీ 120 ఎం ఎల్ సోడాను మిక్స్ చేస్తే అద్భుతమైన పెగ్ వస్తుందని అందులో.. దోసకాయ ముక్కలను స్టఫ్‌గా వేసుకుంటే అదిరిపోతుందని తెలిపింది. ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫోటో తెగ వైరల్ అవుతోంది.