ఇలియానా అంటే ఒకప్పుడు తెలుగు యువతకు కలల రాకుమారి. అందం అంటే ఇలా ఉండాలని తెలుకున్నారు. పూరి జగన్నాద్ పోకిరి సినిమాలో రాసినట్టుగానే కోహీనూర్ డైమండ్ ఇలియానా. ఆమెకు ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారో ఆమె నడుముకు అంతకంటే ఎక్కువ మంది అభిమానులుంటాయి. అసలు చెప్పాలంటే ఆ నడుముతోనే ఇలియానా ఫేమస్ అయింది. అయితే అంతటి ఇలియానా తన శరీరాకృతిని వర్ణించింది.
తాను అందంగా లేను, అంత పర్ఫెక్ట్ కాదని చెప్పుకుంటోంది. ఈ మేరకు ఓ బికినీ ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోను షేర్ చేస్తూ చేసిన కామెంట్స్ మాత్రం వెరైటీగా ఉన్నాయి. తాను బయటకు ఎలా కనిపిస్తానా? అని ప్రతీసారి ఆందోళన చెందుతానని తెలిపింది. తన హిప్స్ బాగా లావుగా ఉంటాయని బాధపడుతుంటానని పేర్కొంది. తొడలు కూడా కాస్త వెరైటీగా ఉంటాయని, నడుము కూడా అంత విశాలంగా కూడా ఉండదని తెలిపింది. వక్షోజాలు అంత పెద్దవి కూడా కాదని, బట్ చాలా పెద్దగా ఉంటుందని వివరించింది.
చేతులు కూడా భిన్నంగా ఉంటాయని, ముక్కు కూడా స్ట్రెయిట్‌గా ఉండదని చెప్పుకొచ్చింది. పెదాలు కూడా ఉండాల్సినంత ఉండవనీ, మరీ అంత పొడవుగా కూడా లేనని బాధపడుతుంటానని తెలిపింది. అంత అందంగా కూడా లేననీ, అంత పర్ఫెక్ట్ కూడా కాదని పేర్కొంది. అయినా ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా ఉండాలని అనుకోలేదని, తాను అంతర్లీనంగా అందగత్తెను అని చెప్పుకొచ్చింది.