Bank Lone On Village: గ్రామాన్ని తాకట్టు పెట్టిన గ్రామస్తులు.. విషయం తెలిసి ఖంగుతిన్న గ్రామస్తులు!

Bank Lone On Village: సాధారణంగా మనం లోన్ పొందాలంటే మన ఇంట్లో బంగారు నగలు లేదా పాసుబుక్కులు లేకుంటే ఇంటి పత్రాలు తాకట్టుపెట్టి లోన్ తీసుకుంటాము.ఇలా అత్యవసర పరిస్థితుల్లో ఇంట్లో విలువైన వస్తువులను తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడం గురించి అందరికీ తెలిసిందే. అయితే మీరు ఎప్పుడైనా ఒక గ్రామం మొత్తాన్ని బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకోవడం గురించి విన్నారా…. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.గ్రామం మొత్తాన్ని ఇద్దరు ప్రతినిధులు కలిసి బ్యాంక్ లోన్ పెట్టి డబ్బు తీసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

ప్రకాశం జిల్లా, పుల్లల చెరువు మండలం, ఇసుక త్రిపురవరం రెవెన్యూ పరిధిలోని సిద్దినపాలెంకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఊరు మొత్తాన్ని తాకట్టు పెట్టారు. ఈ ఊరు మొత్తం ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉండి సర్వే నెంబర్ 296 లో ఉంది. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన సుబ్బయ్య అనే వ్యక్తితో పాటు మరొక వ్యక్తి ఇద్దరు కలిసి నాలుగు ఎకరాలు భూమిని ఆన్లైన్ చేయించుకుని రెవెన్యూ అధికారులతో కలిసి పాస్ బుక్కులను తయారు చేయించారు.ఈ క్రమంలోనే ఈ పాస్ బుక్కులను తాకట్టుపెట్టి లోన్ తీసుకున్నారు.

ఈ విషయం తెలియడంతో అధికారులు ఒక్కసారిగా కంగు తిన్నారు.ఈ క్రమంలోనే ఇద్దరు వ్యక్తులు కలిసి ఊరు మొత్తాన్ని ఎలా స్వాధీనం చేసుకున్నారు? వీరికి సహకరించిన రెవెన్యూ అధికారులు ఎవరు?ఈ విధంగా లోన్ ఇచ్చేటప్పుడు ఎలాంటి ఆధారాలను పరిశీలించకుండా బ్యాంకు అధికారులు ఏ విధంగా లోన్ ఇచ్చారని పై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇద్దరు వ్యక్తుల పై, అలాగే రెవెన్యూ అధికారుల పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఈ విషయం గురించి పెద్ద ఎత్తున దర్యాప్తు కొనసాగిస్తున్నారు.