ప్రకాశం జిల్లాలో జాబ్ మేళా.. పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగ ఖాళీలు?

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ , సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం నిరుద్యోగులకు తీపికబురు అందించాయి. కొండేపిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ నెల 30వ తేదీన జాబ్ మేళాను నిర్వహించనున్నారు. 15 మల్టీ నేషనల్ కంపెనీలు ఈ జాబ్ మేళాకు హాజరు కానున్నారని తెలుస్తోంది. డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ జియో ఇన్ఫో కం, డి మార్ట్, ఎస్ వి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఈ జాబ్ మేళాకు హాజరు కానున్నాయి.

పదో తరగతి, ఇంటర్,ఐ టి ఐ ,డిప్లొమా,డిగ్రీ ,బి.టెక్, పీజీ పూర్తి చేసిన వాళ్లు ఈ జాబ్ మేళాకు హాజరు కావడానికి అర్హత కలిగి ఉంటారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతీ యువకులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 10,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది.

https://skilluniverse.apssdc.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. 6281205538, 8008822821 నంబర్ల ద్వారా ఈ జాబ్ మేళాకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డు జిరాక్స్, బయో డేటా ఫార్మ్, ఇతర సర్టిఫికెట్ల జిరాక్స్ లను తీసుకుని ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. అర్హత ఉన్నవాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

9988853335 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరనుండగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.