డార్లింగ్ అల్లరి చేయకు బుద్దిగా దిగిపో…ట్రంప్ కు భార్య మెలనియా సలహా

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్‌ విజేతగా నిల్చినా,  తుంటరి ట్రంప్ మాత్రం గోలగోల చేస్తున్నాడు. కొంత మంది రిపబ్లికన్‌ సెనెటర్లు, కొన్ని రాష్ట్రాల గవర్నర్లు కూడా న్యాయపోరాటానికి మద్ధతు ఇస్తుండడంతో చివరి నిమిషం వరకు పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో హుందాగ అధికార మార్పిడి జరిగే సూచనలు కనిపించడం లేదు. అక్కడి ప్రొటొకాల్ నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత అమెరికన్ సాధారణ సేవల పాలనా విభాగం అధికార మార్పిడి ప్రక్రియ మొదలు పెడుతుంది. ఓడిపోయిన అధ్యక్షుడికి, గెలిచిన అధ్యక్షుడిగా ఇద్దరికి వర్తమానం పంపుతుంది. అధ్యక్షుడిగా గెల్చిన వ్యక్తి వైట్ హౌస్ వరకు చేరుకునేందుకే చాలా ఖర్చు అవుతుంది. అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటిస్తూ కొత్త అధ్యక్షుడిని వైట్ హౌస్ వరకు తీసుకొచ్చేందుకు భద్రత బలగాలకు బోలెడంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును వైట్ హౌస్ భరించాలి. అలా వచ్చిన కొత్త అధ్యక్షుడిని గౌరవంగా వైస్ హౌస్ లోకి అహ్వానించి తన బాధ్యతలను అప్పగించాలి పాత అధ్యక్షుడు.

కాని ట్రంప్ తీరు ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. అధికార మార్పిడికి ససేమిరా అంటూ… జోబైడెన్ కు దారి ఖర్చులు మంజూరు చేయడం లేదు. తనకు మద్ధతు ఇచ్చేవాళ్లు గంట గంటకు తగ్గుతున్నా ట్రంప్ లెక్కచేయడం లేదు. చివరకు వైట్ హౌస్ నుంచి గెంటేయించుకునేంత వరకు వెళ్తున్నాడు. ఈరకంగా ఆసక్తికరమైన పరిణామాల మధ్య సాగుతున్న రాజకీయాల్లో ట్రంప్ భార్య మెలనియా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించాయి.

 

ట్రంప్‌ ఓటమిని అంగీకరిస్తే బాగుంటుందని ఆమె అన్నారట. అయితే ఈ వ్యాఖ్యలను బహిరంగంగా కాకుండా… ట్రంప్ సన్నిహితుల వద్ద తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లు సీఎన్ఎన్ తెలిపింది. ట్రంప్‌ అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌ కూడా ఓటమిని హుందాగా ఒప్పుకోవాలని కోరినట్లు సీఎన్‌ఎన్‌ తెలిపింది. ఈ వార్త కథనం ప్రసారంతో ఒక్కసారిగా ట్రంప్, మెలనీయా వైవాహిక జీవితం తెరపైకి వచ్చింది. త్వరలో వీళ్లిద్దరు విడాకులు తీసుకుంటున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వైట్ హౌస్ ను వీడగానే మెలనియా డైవోర్స్ కు అప్లై చేస్తారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ మేరకు డైలీ మెయిల్ ఓ కథనాన్ని ప్రచురించింది.