‘శక్తి’ సినిమా ప్లాప్ కి కారణం తాను  కాదంటున్న మెహెర్ రమేష్

ఒకప్పుడు మెహెర్ రమేష్ తెలుగు బిజీ దర్శకుల్లో ఒకడు. సక్సెస్ రేట్ పక్కన పెడితే మెహెర్ రమేష్ టేకింగ్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది. అందుకే కొంతమంది స్టార్ హీరోలు మెహెర్ రమేష్ తో సినిమాలు చేసారు. తన అన్ని సినిమాల్లో ‘బిల్లా’ మాత్రమే యావరేజ్ ఆడింది.
ఎన్టీఆర్ తో తీసిన ‘కంత్రి’, ‘శక్తి’ సినిమాలు ఘోరంగా నిరాశపరిచాయి. వెంకటేష్ తో తీసిన ‘షాడో’ సినిమా తర్వాత మెహెర్ రమేష్ ఇంకే సినిమా చెయ్యలేదు. దాదాపు పదేళ్ల తర్వాత చిరంజీవి తో ఒక సినిమా చేయనున్నాడు మెహెర్ రమేష్.
ఇటీవల ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా బిల్లా సినిమా ను రీ రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమా రీ రిలీజ్ సందర్భంగా మెహర్ రమేష్ ఒక ఇంటర్వ్యూలో శక్తి గురించి మాట్లాడాడు. ఎన్టీఆర్ తో తాను చేయాలి అనుకున్న కథ వేరు.. చేసిన కథ వేరు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.
ఆ టైం లో ఎన్టీఆర్ ‘బృందావనం’ సినిమాలో బిజీ గా ఉన్నాడని ఆ టైం లో తాను అనుకున్న కథని ప్రొడ్యూసర్ అశ్వినీదత్ తన కథని మార్చేసాడని అన్నాడు. తనను కొందరు తప్పదోవ పట్టించడం వల్లే ఫ్లాప్ అయ్యిందని మెహర్ రమేష్ ఇండైరెక్ట్ గా నిర్మాత అశ్వినీదత్ పై విమర్శలు చేశాడు.