క్రేజీ అప్డేట్ : మెగాస్టార్ – సల్మాన్ ల సాంగ్ అదిరిపోతుందట.!

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ తన కెరీర్ లో పాత రోజుల్లా ఒక్కో సినిమాను ఏకకాలంలో కంప్లీట్ చేసేస్తూ వెళ్లిపోతున్నారు. ఇక ఈ చిత్రాల్లో దర్శకుడు మోహన్ రాజా తో ప్లాన్ చేసిన చిత్రం “గాడ్ ఫాదర్” కూడా ఒకటి. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ తో పాటుగా బాలీవుడ్ బిగ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నారని మొదటి నుంచీ టాక్ ఉంది. ఇప్పుడు దీనిపైనే క్రేజీ అప్డేట్ ఇప్పుడు వినిపిస్తుంది.

ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఉన్నాడట. అంతే కాకుండా చిరు మరియు సల్మాన్ ల మధ్య ఓ అదిరే సాంగ్ కూడా ఉందని దానికి ఇద్దరు బడా స్టార్స్ కూడా అదరగొడతారని సంగీత దర్శకుడు థమన్ రీసెంట్ గా తెలిపాడు. సో ఈ సినిమాలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కన్ఫర్మ్ అని అర్ధం అయ్యింది. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు కూడా బజ్ ఉంది.