నయన తార తెలుగులో చేసిన లాస్ట్ సినిమా ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమా తర్వాత ఇంకో తెలుగు సినిమా చేయలేదింతవరకూ. ఒప్పుకోలేదు కూడా. ఇప్పుడు తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలనుకుంటోందట నయన తార. అది కూడా తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో అని తెలుస్తోంది.
ఆల్రెడీ ఓ ప్రముఖ హీరోతో సంప్రదింపులు జరుగుతున్నాయట. లేడీ ఓరియెంటెడ్ కథాంశం అనీ తెలుస్తోంది. అయితే, స్ట్రెయిట్ సినిమా అని ప్రచారం జరుగుతున్నప్పటికీ బైలింగ్వల్ మూవీగా తెరకెక్కే అవకాశాలున్నాయనీ అంటున్నారు. కానీ, స్ట్రెయిట్ తెలుగు సినిమా అని నయన తార ప్రత్యేకంగా సంకేతాలు ఎందుకు పంపిస్తున్నట్లు.? తెలుగులో నయన తార నటించిన సినిమాలను అస్సలు ప్రమోట్ చేసుకోదు.
గతంలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో చిరంజీవితో కలిసి నయన తార స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు వెంకటేష్, నాగార్జున వంటి హీరోలతోనూ నటించింది.
కానీ, ఎప్పుడూ ప్రమోషన్లలో నయన్ కనిపించిందే లేదు. ఆ విషయమై చాలా దుష్ర్పచారం కూడా జరిగింది నయన్‌పై అప్పట్లో.. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా నయన తారను ప్రమోషన్లకు తీసుకురాలేరు అదేంటో. అలాంటిది ఎందుకో తెలీదు.. డైరెక్ట్ సినిమా డైరెక్ట్ సినిమా అంటూ విచిత్రంగా ప్రమోట్ చేసుకుంటోంది. చూడాలి మరి, నయన తారలో ఈ మార్పు ఎందుకో.!