మెగాస్టార్ చిరంజీవికి ‘బోళా శంకర్’ డిజాస్టర్ ఫలితం ఇచ్చింది. ఈ డిజాస్టర్‌కి అనేక కారణాలు. చిరంజీవి తనవంతుగా కృషి చేశారు. మేకింగ్‌లోనూ, ప్రమోషన్స్‌లోనూ శక్తికి మించి కష్టపడ్డారు. అయితే, నెగిటివిటీ ఒకింత, కుల రాజకీయాలు ఇంకొంత ఈ సినిమాని డిజాస్టర్ లిస్టులో పడేశాయ్. ఈ రాజకీయ కుట్రల సంగతి పక్కన పెడితే, సినిమా కంటెంట్ కూడా కొంత కారణమని అంటున్నారు.
ఆల్రెడీ అందరికీ తెలిసిపోయిన కథ ‘వేదాళం’. ఈ సబ్జెక్ట్ చిరంజీవి టచ్ చేయకుండా వుండి వుంటేనే బావుండేదంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆడియన్స్ టేస్ట్‌కి తగ్గట్టుగా సినిమాని మలచలేకపోవడమే ప్రధాన లోపంగా పరిగణిస్తున్నారు. అంతేకాదు, కాస్టింగ్‌లోనూ లోపాలున్నాయ్.
పాత ఆ జబర్దస్త్ టీమ్‌ని చిరంజీవి ఈ సినిమా కోసం తీసుకోవడం కూడా సినిమా పేలవమైన రిజల్ట్ పొందడానికి కారణంగా ప్రచారం జరుగుతోంది. ఈ టీమ్ కారణంగా ఇకపై చిరు సినిమా అంటే, కష్టం అని మేకర్లు భావిస్తున్నారట.
ఇదే విషయాన్ని మెగా కాంపౌండ్ గుర్తెరిగిందట. దాంతో ఇక తప్పలేదట. టీమ్ మొత్తాన్నీ ప్రక్షాళన చేసే కార్యక్రమం మొదలు పెట్టేశారట. చిరంజీవికి ఈ ప్రక్షాళన కార్యక్రమం ఇష్టం లేకున్నా.. తప్పక చేయాల్సి వస్తోందనీ ఆయన సన్నిహితులు అంటున్నారు.
ఆ టీమ్ వైపు నుంచి చూస్తే, చిరంజీవి సినిమాల కారణంగానే మేం పునర్జన్మ ఎత్తామంటూ చెప్పుకుంటున్నారు. కాస్టింగ్ టీమ్‌తో పాటూ, టెక్నికల్ టీమ్‌లోనూ చాలా మందికి ప్రెష్‌గా అవకాశాలిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ‘భోళా శంకర్’ దెబ్బతో ఆ టీమ్‌లోనూ కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయట.