‘నాట్యం’ సినిమాకి మెగా ప్రమోషన్: ఓ రేంజులో

Mega Promotions For Natyam Movie | Telugu Rajyam

డాన్స్ ప్రధానాంశంగా రూపొందుతోన్న చిత్రం ‘నాట్యం’. ఈ మధ్య హాట్ టాపిక్స్‌లో ఈ సినిమా కూడా నిలిచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా ఫంక్షన్‌కి హాజరై, టీమ్‌ని అభినందించడం అందుకు ఓ కారణం అయితే, ప్రచార చిత్రాలు కూడా అందర్నీ ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి.

దాంతో అందరి అటెన్షన్‌నీ ఈజీగా క్యాచ్ చేస్తోందీ సినిమా. సత్యం రామలింగరాజు కోడలు సంధ్యారాణి ప్రధాన పాత్రలో నటిస్తోంది ఈ సినిమాలో. క్లాసికల్ డాన్సర్‌గా ఆమె కనబరుస్తున్న హావ భావాలు, పండించిన ఎమోషన్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్‌గా నిలవడంతో, అందరి నోళ్లలోనూ గొప్పగా నానుతోంది లేటెస్టుగా రిలీజైన ఈ సినిమా ట్రైలర్.

ఇకపోతే, తాజాగా హీరోయిన్ సంధ్యారాణికీ, డైరెక్టర్‌కీ మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు కూడా అందాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కూడా భాగం పంచుకోవడం విశేషం. పౌరాణిక గాధల్లోని విషయాల్ని నేటి తరానికి తగ్గట్లుగా కమర్షియల్ వేల్యూస్ జోడించి చాలా చక్కగా తెరపై ఆవిష్కరించారంటూ చిత్ర యూనిట్‌ని ప్రశంసలతో ముంచెత్తారు చిరంజీవి. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని భరోసా ఇచ్చారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles