Mega Power Multi-Starrer : ‘మెగా – పవర్’ మల్టీస్టారర్ సిద్ధమవుతోందట.!

Mega Power Multi-Starrer

Mega Power Multi-Starrer : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో బోల్డన్ని సినిమాలున్నాయి.. మెగాస్టార్ చిరంజీవి సంగతి సరే సరి. మరి, ఈ ఇద్దరూ కలిసి చేయబోయే సినిమా ఒకటి లైన్‌లోకి వస్తే ఎలా వుంటుంది.? త్వరలో, అతి త్వరలో ఆ మెగా పవర్ అప్‌డేట్ బయటకు రాబోతోందట. ఇందుకోసం తెరవెనుకాల ‘మెగాపవర్’ ప్లానింగ్ జరుగుతోందని అంటున్నారు.

గతంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి నటించారు.. అదే ‘శంకర్‌దాదా జిందాబాద్’. ‘సైరా’ సినిమా కోసం పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ఫుల్ లెంగ్త్ రోల్స్‌లో పవన్, చిరంజీవి కలిసి నటించే సినిమా తెరకెక్కబోతోందన్నది తాజా ఖబర్.

నిజానికి, చాలాకాలంగా చిరంజీవి – పవన్ కళ్యాణ్ కలిసి నటించే సినిమా (Mega Power Multi-Starrer ) కోసం ప్రయత్నాలు జరుగుతున్నా, సరైన కథ అయితే దొరకలేదు. అదే అసలు సమస్య.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఓ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కథ సిద్ధం చేశాడనీ, తుది మెరుగులు దిద్ది త్వరలోనే అటు చిరంజీవికీ, ఇటు పవన్ కళ్యాణ్‌కీ ఆ కథ విన్పించనున్నాడనీ, ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్ళడం లాంఛనమేననీ అంటున్నారు.

ఇంతకీ, ఈ చిత్రాన్ని ఎవరు నిర్మించనున్నారు.? అంటే, ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ‘మెగా బ్యానర్’ భాగస్వామ్యంతో సినిమా నిర్మితమవనుందట.