చంద్రబాబు పబ్లిసిటీ వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు. ఆయన పబ్లిసిటీ దాహానికి తాజాగా ఎనిమిది మంది బలయ్యారు. టీడీపీ వాళ్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా ఆర్థిక సాయం ప్రకటించినా టీడీపీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఎక్కడ అనే కామెంట్లు కనిపిస్తున్నాయి. కందుకూరు ఘటనపై స్పందించే ఆలోచన పవన్ కు ఉందా? లేదా? అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
అయితే కందుకూరు ఘటనపై జనసేన ఎందుకు సైలెంట్ గా ఉందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. జనసేన పార్టీకి స్పందించే ఆలోచన లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఏ చిన్న తప్పు చేసినా భూతద్దంలో చూసే పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేసే తప్పులను మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కు చంద్రబాబు తప్పులు తప్పుల్లా కనిపించవా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ఈ తరహా రాజకీయాలు చేయడం వల్లే ఆయన ఇప్పటివరకు ఒక్క నియోజకవర్గంలో కూడా విజయం సాధించలేకపోయారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మారాల్సిన అవసరం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పవన్ కు వ్యతిరేకంగా ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. చంద్రబాబుపై విమర్శలు చేయడానికి పవన్ కు నోరు రాదని కొంతమంది చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ కు సినిమాలపై ఉన్న ఆసక్తి రాజకీయాలపై లేదని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో కూడా రాజకీయాల్లో ఫెయిల్ అయితే ఆయన సినిమాలకు పరిమితం అయ్యే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.