Pawan And Chiranjeevi : ఇన్సైడ్ టాక్ : చిరు, పవన్ లతో మెగా ఫ్యాన్స్ విసిగి పోతున్నారా..?

Pawan And Chiranjeevi

Pawan And Chiranjeevi : తెలుగు చలన చిత్ర పరిశ్రమ దగ్గర భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బిగ్ స్టార్స్ లో మెగాస్టార్ చిరంజీవి మరియు తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు కూడా ఒకరు అయితే ఈ ఇద్దరు స్టార్స్ తమ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. అయితే అప్పట్లో అంటే సినిమా కోసం పెద్దగా ఆడియెన్స్ అందరికీ తెలియకపోవచ్చు అందుకే వారు ఏ మంచి సినిమా చేసినా సూపర్ హిట్ అయ్యేవి.

అయితే ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు (Pawan And Chiranjeevi) కూడా అప్పటి ఫార్మాట్ లోనే తమ సినిమాలు చేసుకుంటున్నారు. అవే రీమేక్ సినిమాలు. ఏ మంచి సినిమా ఇతర భాషలో వస్తే దాదాపు ఈ ఇద్దరు స్టార్ లు రీమేక్ మీద రీమేక్ చేస్తూ తమ కెరీర్ ని సేఫ్ గా సాఫీగా కొనసాగిస్తున్నారు. లేటెస్ట్ గా అయితే పవన్ భీమ్లా నాయక్ రీమేక్ కాగా మెగాస్టార్ అయితే రెండు రీమేక్ సినిమాలు లైన్ లో పెట్టుకున్నారు.

ఇప్పుడు మళ్ళీ తీరా పవన్ మరో రీమేక్ సినిమా చెయ్యనుండడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు సినీ వర్గాల్లో ఇన్సైడ్ టాక్. అందరు స్టార్ హీరోలు ఏవేవో సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టాండర్డ్స్ పెంచుతూ ఉంటే ఈ హీరోలు మాత్రం ఇంకా రీమేక్ సినిమాలు చేసుకుంటూనే ఉండిపోతున్నారని బాగానే నిరాశలో ఉన్నారట.

ఓ సినిమాతో ఆగింది అనుకుంటే మరో సినిమాని అనౌన్స్ చేస్తూ ఉండడంతో బాగా విసుగెత్తి పోతుండడమే కాకుండా ఇతర హీరోల అభిమానులని కూడా డిఫెండ్ చేసుకోలేకపోతున్నారట. మరి ఈ హీరోలు ఈ రీమేక్ సినిమాలు ఆపరు తమ అభిమానులకి ఇవి తప్పవని చెప్పాలి.