ఒకప్పుడు తెలుగు, మలయాళం లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మీరా జాస్మిన్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. అప్పట్లో ఎంతో పద్దతిగా, ఎక్సపోసింగ్ కి దూరంగా ఉండే మీరా జాస్మిన్ ఈ మధ్య మాత్రం హాట్ గా మారింది.
ఎంతో సాఫ్ట్ గా ఉండే మీరా జాస్మిన్ పర్సనల్ లైఫ్ మాత్రం ఎప్పుడూ వివాదాలతో ఉండేది. చాలా వివాదాలు మధ్య మీరా జాస్మిన్ 2014 ఫిబ్రవరి 12న తిరువనంతపురంలో అనిల్ జాన్సన్ ని పెళ్లి చేసుకుంది. ఆయన దుబాయ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసేవాడు. అయితే మీరా జాస్మిన్ తో పెళ్లికి ముందే అనిల్ కి వేరొక అమ్మాయితో వివాహం కుదుర్చుకున్నాడు. మీరా జాస్మిన్ తో పెళ్లి సంబంధం రావడంతో అంతకు ముందు కుదుర్చుకున్న పెళ్లిని ఆపేసి మీరా జాస్మిన్ తో అనిల్ పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇది ఆ మధ్య కాలంలో పెద్ద వివాదమే సృష్టించింది. పెళ్ళైన మూడేళ్లకే 2017 లో ఇద్దరూ విడిపోయారు.
అయితే మీరా జాస్మిన్ విడాకులకు కారణం ఇండస్ట్రీ నుంచి ఒక వ్యక్తి కారణం అంటూ వార్తలు గుప్పుమన్నాయి. మీరా జాస్మిన్ కి సంబంధించిన ఆస్తులన్నీ కూడా మీరా జాస్మిన్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఉండేవి. ఇప్ప్పుడు తన ఆస్తులు తనకు కావాలని మీరా జాస్మిన్ కోర్ట్ కి ఎక్కింది. ఈ విషయంపై మీరా కుటుంబం సైతం స్పందించింది. ఆమె ప్రస్తుతం ఓ వ్యక్తి మోజులో ఉందని, అతడి వల్ల ఆమె కెరియర్ పాడయ్యే అవకాశం ఉందని, అంతేకాకుండా ఆమె ప్రాపర్టీ కూడా అతడు నాశనం చేస్తాడని భయంతోనే సదరు ప్రాపర్టీని ఆమెకు ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకున్నాం అంటూ వివరణ ఇచ్చారు.