ఆ సమస్యతో బాధపడుతున్న మీనా.. అందుకే రెండో బిడ్డను వద్దనుకున్నారా?

సీనియర్ నటి మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు తమిళ పరిశ్రమలలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీనా ఒకానొక సమయంలో వెండితెర అగ్రతారగా వెలిగిపోయారు. విద్యాసాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. వీరిద్దరికీ నైనిక ఓ చిన్నారి ఉంది. అయితే విద్యాసాగర్ గత నెల 29 వ తేదీ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఈయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ మృతి చెందారు.

ఇకపోతే మీనా విద్యాసాగర్ దంపతుల కుమార్తె నైనిక వయసు ప్రస్తుతం 11 సంవత్సరాలు.ఈ దంపతులకు 11 సంవత్సరాల కుమార్తె ఉన్న రెండవ సంతానం కోసం ప్రయత్నం చేయలేదు.అయితే ఈ విధంగా వీరిద్దరూ రెండో సంతానం వద్దనుకోవడానికి కారణం కూడా ఉంది. మీనా గర్భాశయ సమస్యలతో బాధపడుతున్న కారణంగా ఈమె రెండవ సంతానం గురించి ఆలోచించలేదని, మరో బిడ్డ కావాలనుకుంటే తన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని తెలియడంతో ఈమె రెండవ బిడ్డను వద్దనుకున్నారని తెలుస్తుంది.

ఇకపోతే నైనిక మీనా మాదిరిగానే ఇప్పటికే బాలనటిగా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ఈమె కూడా బాలనటిగా అందరి ప్రశంసలు అందుకున్నారు. ఇకపోతే భవిష్యత్తులో మీనా కూతురు కూడా హీరోయిన్ గా పేరు సంపాదించుకుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.ఇకపోతే మీనా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే ఇలా తన భర్త విద్యాసాగర్ మృతి చెందడం తనని ఎంతగానో కృంగదీసింది. అయితే ఈమె తరువాత సినిమాలలో నటిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.