శివ బాలాజీ, కౌషల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్.. ఇలా నాలుగు సీజన్లకూ బిగ్‌బాస్ విన్నర్‌గా మగవాళ్లే ఎంపికయ్యారు. గత సీజన్లలో మగవాళ్లకు పోటీగా ఆడవాళ్లు కూడా ఎక్కడా రాజీ పడకుండా తమ సత్తా చాటారు. దాంతో కొద్దో గొప్పో అడవాళ్లకు గత సీజన్లలో విన్నరయ్యే అవకాశాలున్నాయంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు ఎదురు చూశారు. కానీ, జరగలేదనుకోండి.
ఈ సీజన్ విషయానికి వస్తే, ఈ సీజన్‌లో బిగ్ బాస్ విన్నర్ కావడానికి అన్ని క్వాలిటీస్ ఉన్న లహరి, శ్వేత, తదితర లేడీ కంటెస్టెంట్లు అనూహ్యంగా, అకారణంగా ముందుగానే ఎలిమినేట్ అయిపోయారు. ఇక ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఆడ లేడీస్‌లో ఎవ్వరికీ ఆ అర్హత లేదనేది నెటిజనం అభిప్రాయం.
అంతేకాదు, బిగ్ బాస్ రెండో సీజన్ విన్నర్ అయిన కౌశిక్ కూడా ఇదే విషయంపై ఆల్రెడీ జోస్యం చెప్పేశాడు. ఈ సీజన్‌లో లేడీస్‌కి విన్నర్ అయ్యేంత సీన్ లేదని తేల్చేశాడు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్నఆడ లేడీస్ పరిస్థితి చూస్తుంటే, అవును అది నిజమే అని ఒప్పుకోక తప్పదనిపిస్తోంది.
ప్రస్తుతం హౌస్‌లో నలుగురు లేడీస్ మాత్రమే ఉన్నారు. కాజల్ అదేదో స్ర్టాటజీ అంటుంది. ప్రియాంక, మానస్ లవ్ కోసం వెంపర్లాడుతోంది. సిరి, షన్నూ కోసం తప్ప హౌస్‌లో తానెందుకుంటోందో తనకే తెలీదు. ఇక యానీ మాస్టర్ ఏదో చేసేయాలనుకుంటుంది. చివరికి ఏదీ చేయలేక మూలన కూర్చుంటుంది. అదీ బిగ్ ‘లేడీ’ బాస్ పరిస్థతి.