కుటుంబానికి ఆడియో మెసేజ్ చేసి.. కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న మహిళ.. కారణం అదే!

రాజస్థాన్ లోని ఒక వివాహిత తన రెండున్నరేళ్ల చిన్నారితో కలిసి ఆత్మహత్య ప్రస్తుతం మిస్టరీగా మిగిలిపోయింది. ఆత్మహత్యకు ముందు ఆ వివాహిత ఒక ఆడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే తన చావు గల కారణం జైపూర్ లో నివసిస్తున్న మహిళ పట్వారి అని తెలిపింది. ఇక ఆ ఆడియో కాస్త వైరల్ అయ్యింది. అంతేకాకుండా ఆడియోలో ఆ చనిపోయిన వివాహిత అత్తగారు చాలా మంచిది అని తెలిపింది. ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన కలకలం రేగింది.

ఇక ఈ విషయం తెలుసుకున్న పంచోర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ మహిళ అత్తమామల నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో, ఆడియోలో చెప్పిన ఆ మహిళ పట్వారి ఎవరు అన్నది తెలుసుకోవడం పోలీసులకు పెద్ద కష్టంగా మారింది. అంతేకాకుండా ఆమె చనిపోతూ తన అమాయకమైన కూతుర్ని కూడా ఎందుకు పొట్టనపెట్టుకుంది అన్నది మిస్టరీగా మిగిలిపోయింది. సంచోర్ లోని బాల్వానాకు చెందిన ప్రకాష్ దేవి తన రెండున్నర ఏళ్ల కుమార్తె ఆర్యతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఆమె భర్త అశోక్ కుమార్ సంచోర్ లో పట్వారిగా పని చేస్తున్నాడు. ఇక రెండు రోజుల క్రితం బంధువుల పెళ్ళికి వెళ్ళడానికి ప్రకాష్ దేవి తన అత్తగారి ఇంటికి వచ్చింది. ఇంట్లో ప్రకాష్ దేవి ఆమె కూతురు ఆర్య ఒంటరిగా ఉన్నారు. అప్పుడు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ప్రకాష్ దేవి ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్ లో వాయిస్ మెసేజ్ పెట్టింది. ఆ తరువాత తన కూతుర్ని ఒడిలోకి తీసుకుని నీటి గుంతలోకి దూకింది. ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్ లో ఆ వాయిస్ మెసేజ్ విన్నవాళ్ళ కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అందరూ ఇంటి వైపు పరుగులు తీశారు. కానీ ఇంటి దగ్గర ప్రకాష్ దేవి, ఆర్య కనిపించలేదు. చివరికి ఆరు గంటల ప్రాంతంలో నీటి కుంటలు మృతదేహమై తేలారు. ప్రకాష్ దేవి నాలుగేళ్ల కుమారుడు అదే ఇంట్లో ఉన్నాడు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.