Devotional Tips: సాధారణంగా వివాహమైన తర్వాత ప్రతి ఒక్క ఆడపిల్ల తన పుట్టింటిని వదిలి అత్తవారింటికి వెళ్లాల్సిందే. ఈ విధంగా అత్తవారింట్లో అడుగు పెట్టిన అమ్మాయి అప్పుడప్పుడు పుట్టింటికి వస్తూ వెళ్తుంటారు. అయితే పుట్టింటి నుంచి అత్త వారి ఇంటికి వెళ్లే సమయంలో కొన్ని రకాల వస్తువులను తీసుకెళ్లడం సర్వసాధారణం. ఇలా పుట్టింటిలో తనకు నచ్చిన వస్తువులను కూతురు అత్తారింటికి తీసుకెళ్లడం మనం చూస్తుంటాము.అయితే ఏవిపడితే ఆ వస్తువులను పుట్టింటి నుంచి అత్తారింటికి తీసుకెళ్లడం వల్ల పలు సమస్యలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు. మరి పుట్టింటి నుంచి అత్తారింటికి ఎలాంటి వస్తువులు తీసుకెళ్లకూడదదో ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా పుట్టింటి నుంచి అత్తవారింటికి స్త్రీలు పూజకు సంబంధించిన వస్తు సామాగ్రిని పొరపాటున కూడా తీసుకెళ్లకూడదు. ఇలా పూజాసామాగ్రిని అత్తవారింటికి తీసుకెళ్లడం వల్ల ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అదేవిధంగా పులుపు, చేదు వస్తువులను కూడా పుట్టింటి నుంచి ఇంటికి తీసుకు వెళ్ళకూడదు. పులుపు వస్తువులను అత్తవారింటికి తీసుకెళ్లడం వల్ల రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. అలాగే చేదు వస్తువులను తీసుకోవడం వల్ల ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి రెండు కుటుంబాల మధ్య మాటలు లేకుండా పోతాయి.
ఇక లక్ష్మీ స్వరూపంగా భావించే ఉప్పు, చింతపండు, చీపుర వంటి వస్తువులను కూడా అత్తవారింటికి తీసుకెళ్లకూడదు. ఇలా తీసుకెళ్లడం వల్ల సాక్షాత్తు పుట్టింటిలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని అత్తవారింటికి తీసుకెళ్లినట్లు. ఇలా ఈ వస్తువులను తీసుకెళ్లడం వల్ల పుట్టింటిలో ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి.ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో ఈ వస్తువులను తీసుకెళ్లాల్సి వస్తే కొద్ది మొత్తంలో డబ్బును పుట్టింటి వారికి చెల్లించి తీసుకెళ్లడం మంచిది. లేదంటే ఇరు కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి.