వైసీపీ మంత్రులు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు హైలెట్ అవుతూ ఉంటారు. సీజన్ ప్రకారం ఈ టైమ్ ఒకరు ఈ టైమ్ ఇంకొకరు అంటూ వార్తలూ నిలుస్తూ వస్తున్నారు. టైం టేబుల్ వేసుకున్నట్టు ఒక్కొక్కరిగా వార్తలకెక్కుతున్న మంత్రులను చూస్తే వీళ్లంతట వీళ్ళే ఇరుక్కుంటున్నారా లేకపోతే ఎవరైనా ఇరికిస్తున్నారా అనే అనుమానం రాకుండా ఉండదు. అసలే జగన్ పదవులు ఇచ్చేటప్పుడు రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, పనితీరు బాగుంటే పదవుల్లో ఉంటారు లేని పక్షంలో వేరొకరికి అవకాశం ఇస్తాం అనే సంగతిని స్పష్టంగా చెప్పేశారు. అందుకే కొందరు మంత్రులు తమ ప్రాభవాన్ని బలంగా చాటుకునే ప్రయత్నం చేశారు. ప్రత్యర్థులను చెండాడుతూ వార్తల్లో నిలవడానికికి ట్రై చేశారు. అయితే టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. మనం వేస్తే మన మీద రెండొచ్చి పడతాయి అనే రీతిలో మంత్రులు బుక్కవుతున్నారు.
మొదట్లో కర్నూల్ మంత్రి గుమ్మనూరు జయరాం మీద అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున లేచాయి. బెంజ్ కార వివాదం జగన్ వరకు వెళ్ళింది. ఆ తర్వాత ఆయన సొంత గ్రామంలో పేకాట శిబిరాలను పోలీసులు పట్టుకున్నారు. దాని వెనుక కూడ జయరాం ఉన్నటు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక మరొక మంత్రి కొడాలి నానిది కూడ ఇదే పరిస్థితి. మంత్రి పదవి రాగానే ప్రత్యేక హక్కులు సంక్రమించాయని అనుకున్నారో ఏమో కానీ నోటికి పనిచెప్పారు నాని. ప్రత్యర్థుల మీద వీర లెవల్లో మాటల దాడికి దిగారు. ఆయన మాటల్ని మొదట్లో ఎంజాయ్ చేసిన వైసీపీ అభిమానులు సైతం ఆతర్వాత మరీ ఇంత లూజ్ టంగ్ ఏంటి అనుకున్నారు. ఆయన మీద పేకాట క్లబ్బుల వివాదాలు రేగాయి. దాంతో ఆయన కాస్త సైలెంట్ అయ్యారు.
ఇక తాజాగా వ్యవహారం మొత్తం మంత్రి వెల్లంపల్లి చుట్టూ తిరుగుతోంది. తొలి నుండి వెల్లంపల్లి వార్తల్లోనే ఉన్నారు. అయితే ఈసారి మరీ ఎక్కువగా నిలుస్తున్నారు. దుర్గ గుడిలో అక్రమాలు జరిగాయని, వాటి వెనుక మంత్రి ఉన్నారని, దేవుడి సొమ్మును దోచుకుంటున్నారని అనేకరకాల ఆరోపణలు. ఏసీబీ ఎంటరైంది. మంత్రి పేరు ప్రముఖంగా నానుతోంది జనంలో. ఇలా ఒక్కొక్క మంత్రి ఒక్కోలా ఒకరి తర్వాత ఒకరు హైలెట్ అవడం, వివాదంలో చిక్కుకోవడం చూస్తే వీరిని ఎవరైనా ఇరికిస్తున్నారా లేకపోతే వీరికి వీరే ఇరుక్కుంటున్నారు అనే అనుమానం వస్తోంది. ఒకవేళ ఇరికించారనే అనుకుంటే మంత్రుల మీద ప్రతిపక్ష నేతలు అందునా బలహీనమైన ప్రతిపక్షం కుట్రలు పన్నాగాలడా అనేదే పెద్ద అనుమానం.