అక్క చెల్లెలు మధ్యలో బాబాయ్

విజయనగర గజపతుల మధ్య నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. అశోక్‌ గజపతి రాజుకు , సంచయిత మధ్య ప్రారంభమైన వార్ లోకి ఇప్పుడు ఊర్మిళా ఎంటర్ అయింది. దీంతో మొత్తం వ్యవహారంలో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ఈ వివాదంలోకి దిగిన ఊర్మిళ గరిష్టంగా సంచయితనే తప్పుపట్టుతుండడంతో ఆశోకగజపతిరాజు, ఈమెను ఊసిగొల్పి ఉంటారనే టాక్ నడుస్తోంది.

సిరిమానోత్సవం కారణంగా ఏర్పడిన రగడ పూసపాటియుల గొడవలో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. సంచయిత అధికారాన్ని అడ్డం పెట్టుకొని సిరిమానోత్సవంలో తమను బలవంతంగా బయటకు గంటేశారని ఊర్మిళ ఆరోపిస్తున్నారు. ఇక ఆశోకగజపతి రాజు కూడా తమను  మాన్సాస్‌ వ్యవహారాల్లో ఏనాడు సంప్రదించలేదని తప్పుపట్టారు. సంప్రదింపులు జరపడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆయన లెక్కచేయలేదని ఆరోపించారు.

అయితే ఆమే చేసిన ఆరోపణల్లో సింహభాగం సంచయితను తప్పుపట్టే విధంగా ఉండడంతో ఈ మొత్తం వ్యవహారంలో ఆశోకగజపతి రాజు హస్తం ఉండొచ్చనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ వివాదంలోకి దిగిన ఊర్మిళ మొత్తం వ్యవహారంపై వ్యక్తిగతంగా న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. ఎప్పుడైతే ఊర్మిళ నోట న్యాయపోరాటం అన్న మాట వచ్చిందో… అప్పటి నుంచి అశోకగజపతి రాజు పై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరుంది. న్యాయపోరాటం పేరుతో ఈ వివాదాన్ని కొత్త మలుపుతిప్పేందుకు ఆయనే ఊర్మిళను రంగంలోకి దించి ఉంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.  ద్విముఖ పోరును త్రిముఖ పోరులా మార్చేందుకే ఊర్మిళను అశోకగజపతి రాజు రంగంలోకి దించి ఉంటారని టాక్. రాను రాను ఈ గజపతుల యుద్ధం ఇంకెన్ని ఇంట్రిస్టింగ్ ట్విస్టులు చూడాల్సి వస్తుందో.