ఏపీలోని విజయనగరంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వేర్వేరు విభాగాలలో ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయి. సైకియాట్రిక్ సోషల్ వర్కర్, సైకియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ గ్రేడ్3, లైబ్రరీ అసిస్టెంట్, స్టోర్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, ఎలక్ట్రికల్ హెల్పర్, కంప్యూటర్ ప్రోగ్రామర్, అడ్మినిస్ట్రేటర్, ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 91 ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడుతున్నాయి.
ఓటీ, డెంటల్, సిస్టమ్, నెట్వర్క్ విభాగాలతో పాటు ఇతర విభాగాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, బీఈ, పీజీ, ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సు 42 సంవత్సరాలు మించకూడదు.
ఎస్సీ, ఎస్టీ, ఈఎడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు వయో పరిమితిలో సడలింపులు ఉండగా పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్ మేన్ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపులు ఉండనున్నాయి. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మార్కులు, సర్టిఫికెట్ల పరిశీలన అధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2025 సంవత్సరం జనవరి 1వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.