జబర్దస్త్ లో ఈయనైనా పర్మనెంట్ జడ్జ్ గా కొనసాగుతారా?

టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక రేటింగ్స్ తో టాప్ షో గా గుర్తింపు పొందిన జబర్దస్త్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారిపోయింది. గత కొంతకాలంగా జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన కమెడియన్లు, యాంకర్లు జబర్దస్త్ కి దూరమవుతున్నారు. సినిమా అవకాశాలు, ఇతర చానల్స్ లో అత్యధిక రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడం వల్ల ఎంతోమంది జబర్దస్త్ కి దూరమయ్యారు. ఇప్పటికే అదిరే అభి , ఆది సుధీర్ వంటి ఫేమస్ కమెడియన్లు జబర్దస్త్ లో కనిపించడం లేదు. అంతేకాకుండా జబర్దస్త్ మొదలైనప్పటినుండి ఆ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా కూడా ఇటీవల మంత్రి పదవి దక్కటంతో జబర్దస్త్ కి దూరమైంది. అంతకుముందే మల్లెమాల వారితో మనస్పర్ధలు కారణంగా నాగబాబు జబర్దస్త్ నుండి బయటకు వెళుతూ అతనితో పాటు మరి కొంతమంది కమెడియన్లను కూడా వెంటబెట్టుకెళ్ళాడు.

గత కొంతకాలంగా జరుగుతున్న ఈ పరిణామాల వల్ల జబర్దస్త్ పరిస్థితి దారుణంగా తయారయింది. ఇక తాజాగా యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ కి స్వస్తి చెప్పింది. ఇలా ఒక్కొక్కరు జబర్దస్త్ నుండి వలస వెళ్లడంతో జబర్దస్త్ రేటింగ్స్ భారీగా పడిపోయాయి. ఒకప్పుడు 18 రేటింగ్స్ తో దూసుకుపోయిన జబర్దస్త్ ఇప్పుడు 6, 7 తో సరిపెట్టుకుంటుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరి కొంత కాలంలో జబర్దస్త్ పూర్తిగా నిలిపివేసి అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా నాగబాబు జబర్దస్త్ కి దూరమైన తర్వాత ఆ స్థానంలో రోజాతో కలిసి సింగర్ మనో జడ్జిగా వ్యవహరించారు.

గత కొంతకాలంగా మనో కూడా జబర్దస్త్ లో ఎక్కువగా కనిపించడం లేదు. రోజా జడ్జ్ గా ఉన్న సమయంలో ప్రతి ఎపిసోడ్ లోనూ కనిపించిన మనో ఇప్పుడు మాత్రం కనిపించడం లేదు. ఇటీవల మాటీవీలో ప్రసారమైన సూపర్ సింగర్ జూనియర్స్ అనే షోలో మనో జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. దీంతో రెండు టీవీ షోలలో జడ్జిగా వ్యవహరించడానికి మనో కి డేట్స్ కుదరటం లేదు. గత కొంతకాలంగా మనో జబర్దస్త్ లో కనిపించడం లేదు. కానీ ఈ వారం ప్రసారం కాబోతున్న జబర్దస్త్ షోలో మనో రీ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఇప్పటికైనా మనో జడ్జిగా కొనసాగుతాడా లేక అందరిలాగే జబర్దస్త్ కి దూరం అవుతాడా ?అని ప్రేక్షకులలో అనుమానాలు మొదలయ్యాయి