బుల్లితెర నటి నటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మంజుల, నిరుపమ్ గురించి అందరికీ సుపరిచితమే.చంద్రముఖి సీరియల్ ద్వారా పరిచయమైన వీరిద్దరు ఈ సీరియల్ తోనే పరిచయం పెరిగి ఆ పరిచయం ప్రేమగా మారి చివరికి పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇకపోతే మంజుల అడపాదడపా సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేయగా నిరుపమ్ మాత్రం వరుస సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర శోభన్ బాబుగా గుర్తింపు పొందారు.ఇకపోతే ఈయన నటించిన కార్తీకదీపం సీరియల్ ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
ప్రస్తుతం ఈ సీరియల్ నుంచి నిరుపమ్అలియాస్ డాక్టర్ బాబు దూరం కావడంతో ఇక ఈయన ఎటువంటి సీరియల్స్ చేయకుండా తన భార్య మంజులతో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. మంజుల సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారనే విషయం మనకు తెలిసిందే. నిత్యం తనకు సంబంధించిన ఫొటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటారు. ఇకపోతే తాజాగా ఈమె ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు.
ఈ వీడియోలో భాగంగా తనని పెళ్లి చేసుకోమని డాక్టర్ బాబు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి తన వింత స్టెప్పులతో తనని విసిగిస్తూ తనని పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డారు.ఈ విధంగా తన నుంచి తప్పించుకొని డాక్టర్ బాబు దూరంగా వెళ్లిన మంజుల మాత్రం తన వెనకే వెళ్ళి తనని పెళ్లి చేసుకోవాలి అంటూ చెప్పారు. ఈ క్రమంలోనే తన గోల భరించలేక డాక్టర్ బాబు ఏకంగా తల పట్టుకొని వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.