Ponniyan Selvan : భారీ ధరకు మణిరత్నం ప్రతిష్టాత్మక చిత్రం ఓటిటి హక్కులు

Maniratnam Ponniyan Selvan

Maniratnam Ponniyan Selvan : మన భారతీయ సినిమాని ఇప్పుడు అంటే పలువురు దర్శకులు పలు భారీ సినిమాలతో ఓ రేంజ్ లో నిలబెట్టారు. కానీ వాటిలో సరైన కథ లేదు అని అందరికీ తెలుసు. కానీ ఎప్పుడో తమ కంటెంట్ లోని సత్తా తో ఇండియన్ సినిమా దగ్గర పేరు తెచ్చుకున్న టాప్ మోస్ట్ దర్శకుల్లో తమిళ స్టార్ దర్శకుడు మణిరత్నం కూడా ఒకరు. తనదైన సినిమాలతో మూవీ లవర్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చిన తాను ఫస్ట్ టైం ఒక బిగ్గెస్ట్ సినిమాని తీస్తున్నారు.

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన సినిమానే “పొన్నియన్ సెల్వన్”. మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ సినిమా లో చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తుండగా కార్తీ, ఐశ్వర్య రాయ్ అలాగే ఎందరో స్టార్ నటులు కలయికలో మన ఇండియన్ సినిమా దగ్గర ఒక భారీ మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే కేవలం థియేటర్ లలోనే మొదట రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమా పై లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాని ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు భారీ ధర ఇచ్చి కొనుగోలు చేసారట. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 125 కోట్లకి పైగా చెల్లించి కొనుగోలు చేసారట. దీని బట్టి ఈ భారీ సినిమాపై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ సినిమాకి లైకా ప్రొడక్షన్ వారు 500 కోట్లతో తెరకెక్కిస్తుండగా సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్లోనే విడుదల కానుంది.