శ్రీను వైట్ల ని నమ్మిన ” మంచి ” విష్ణు ..బ్లాక్ బస్టర్ సీక్వెల్ ఢీ కి రెడీ ..!

టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున చెప్పిన సక్సస్ ఫుల్ ఫార్ములా తో వరసగా టాలీవుడ్ స్టార్ హీరోలకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల. నీకోసం సినిమాతో దర్శకుడిగా మారిన శ్రీను వైట్ల ఆ తర్వాత ఆనందం సినిమాతో సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా మారాడు. వరసగా రవితేజ, మహేష్ బాబు, నాగార్జున, వెకటేష్, చిరంజీవి లాంటి సీనియర్ హీరోలతో పాటు మంచు విష్ణు.. రామ్ లాంటి యంగ్ హీరోలతో సినిమాలు తీసి హిట్ ఇచ్చి స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగాడు. కామెడీ ప్రధానంగా చేసుకుంటూనే కంప్లీట్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ సినిమాలతో శ్రీను వైట్ల ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు.

Image

సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన దూకుడు కొత్త రికార్డ్స్ క్రియోట్ చేసింది. అయితే ఈ సినిమా తర్వాత మళ్ళీ మహేష్ బాబు తో తీసిన ఆగడు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. అప్పటి నుంచి శ్రీను వైట్ల కి మళ్ళీ సాలీడ్ హిట్ దక్కలేదు. రవితేజ తో తీసిన గత చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ మీద చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తో మళ్ళీ సక్సస్ ట్రాక్ ఎక్కుతానని భావించాడు. కాని ఈ సినిమా కూడా శ్రీను వైట్ల కి షాకిచ్చింది. ఆ తర్వాత ఈ దర్శకుడు నించి మళ్ళీ సినిమా రాలేదు.

అయితే గత కొన్ని రోజులుగా శ్రీను వైట్ల – మంచు విష్ణు కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ హిట్ ఢీ కి సీక్వెల్ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికి అఫీషియల్ గా న్యూస్ రాలేదు. దాంతో ఇది రూమర్ అని అందరు భావించారు. కాని తాజాగా మంచు విష్ణు ఈ సినిమా కి సీక్వెల్ ని ప్రకటించి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఈ నెల మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా శ్రీను వైట్ల – మంచు విష్ణు కాంబినేషన్ లో డీ కి సీక్వెల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. మొత్తానికి మంచు విష్ణు సక్సస్ లో లేని దర్శకుడికి అవకాశం ఇచ్చి ” మంచి ” విష్ణు అనిపించుకున్నాని అంటున్నారు.