Prabhas–Kannappa: కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ వస్తున్నాడా.. ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తున్నారో తెలుసా?

Prabhas-Kannappa: మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని సొంత బ్యానర్ లో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, మోహన్ బాబు ఇలా చాలా మంది స్టార్స్ నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఈ సినిమా ఈనెల 27వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీ మేకర్స్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.

ఇప్పటికే కొచ్చి, బెంగళూరు, రాజస్థాన్, ముంబై, గుంటూరు, చెన్నై నగరాల్లో ఈవెంట్స్ నిర్వహించారు. ఇప్పుడు కన్నప్ప భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారట. కన్నప్ప గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో జూన్ 21 శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కి మూవీ యూనిట్ అంతా హాజరవుతారట. అలాగే పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరవనున్నారట. ముంబై ఈవెంట్ కి అక్షయ్ కుమార్, కొచ్చి ఈవెంట్ కి మోహన్ లాల్, బెంగుళూరు ఈవెంట్ కి శివన్న వచ్చారు కాబట్టి హైదరాబాద్ ఈవెంట్ కి ప్రభాస్ గెస్ట్ గా వస్తాడని భావిస్తున్నారు. విష్ణు కూడా ప్రభాస్ ని ఈవెంట్ కి తీసుకొస్తాను అని గతంలో ఇంటర్వ్యూలో తెలిపాడు.

సినిమాలో ప్రభాస్ ఆల్మోస్ట్ అరగంట సేపు కనిపించబోతున్నాడు. ప్రభాస్ ఎలాగో ఇప్పుడు హైదరాబాద్ లోనే షూటింగ్ లో ఉన్నాడు కాబట్టి శనివారం సాయంత్రం షూట్ అయ్యాక కన్నప్ప ఈవెంట్ కి హాజరవుతాడని మంచు ఫ్యామిలీ సన్నిహితుల సమాచారం. ప్రభాస్ ఈవెంట్ కి వస్తే ఫ్యాన్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది. మరి ప్రభాస్ 21వ తేదీ జరిగే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తారు రారో చూడాలి మరి. ఒకవేళ ప్రభాస్ వస్తే మాత్రం సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం అని చెప్పాలి.