Manchu Vishnu: మంచు విష్ణు హీరోగా నటించిన మూవీ కన్నప్ప. ఇది విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్,మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి స్టార్స్ కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ హిస్టారికల్ ఎపిక్ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు మరొక ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. దాంతో మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.
ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్స్, సాంగ్స్,అప్డేట్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇది ఇలా ఉంటే మూవీ మేకర్స్ తాజాగా కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు శివరాజ్ కుమార్ వంటి వారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఈ ఈవెంట్ లో భాగంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేయాలని ఎందుకనిపించింది అని ప్రశ్నించగా మంచు విష్ణు స్పందిస్తూ.. ఈ తరానికి కన్నప్ప గురించి, వాయులింగం గురించి, శ్రీకాళహస్తి గురించి చెప్పమని శివుడి ఆదేశించాడని చెప్పాను.
స్నేహితుల్లో కృష్ణుడు, కర్ణుడిలా రెండు రకాలు ఉంటారు. నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు. తన జీవితంలో కర్ణుడిలా ఎప్పుడు ఏం చేసినా వెనకే ఉంటాను. ఆయన ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు. నాన్నపై ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవంతో ఒప్పుకున్నాడు. ప్రభాస్ ప్రపంచంలోనే ఒక పెద్ద స్టార్ హీరో. కానీ మేమిద్దరం మొదటి రోజు ఎలా కలిశామో.. ఇప్పటికీ అలాగే ఉన్నాము అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఈవెంట్లో భాగంగా మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.