Manchu Controversy : మంచు వివాదం: పదిహేను వేలా.? ఐదు లక్షలా.?

Manchu Controversy : మంచు మోహన్ బాబు, మంచు విష్ణు.. తమ వద్ద పని చేసే ఓ వ్యక్తి ఐదు లక్షల విలువ చేసే మేకప్ సామాగ్రిని దొంగిలించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. సదరు వ్యక్తి నాగ శ్రీను మీడియా ముందుకొచ్చాడు. తాను హెయిర్ డ్రస్సర్‌ననీ, తాను మేకప్ మేన్‌ని కాననీ, అసలు తాను ఆ దొంగతనం చేయలేదనీ అంటున్నాడు.

మోహన్‌బాబు, మంచు విష్ణు తనను నిర్బంధించి బూతులు తిట్టారనీ, తన కులవృత్తిని అవమానించారనీ, తన కుటుంబంపై దారుణమైన దూషణలతో విరుచుకుపడ్డారనీ ఆరోపించిన నాగ శ్రీను, ఐదు లక్షల విలువైన హెయిర్ డ్రెస్సర్ పరికరాలే వుండవని తేల్చేశాడు.
‘సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోండి.. ఆఫీసులో దొంగతనం జరిగిందని అంటున్నారు కదా.. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ వుంటుంది.. అందులో తెలిసిపోతుంది దొంగతనం జరిగిందో లేదో..’ అని నాగశ్రీను తెగేసి చెప్పాడు.

కాగా, హెయిర్ డ్రెస్సింగ్‌కి ఉపయోగించే పరికరాల విలువ గట్టిగా లెక్కేస్తే పదిహేను వేలు కూడా వుండదన్నది నాగశ్రీను వాదన. కాగా, నాగశ్రీను కులవృత్తిని మోహన్ బాబు దూషించారంటూ మీడియాలో వస్తున్న కథనాలతో, ఆయా సామాజిక వర్గ ప్రతినిథులు మీడియాకెక్కుతున్నారు. మోహన్ బాబు మీద మండిపడుతున్నారు. తమ సామాజిక వర్గానికి బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్నారు.

క్రమశిక్షణ అనీ, ఇంకోటనీ.. వేదికలెక్కి నీతులు చెప్పే మంచు కుటుంబం ఇలాంటి వివాదంలో ఎందుకు ఇరుక్కుంది చెప్మా.? చెప్పేవి శ్రీరంగ నితులు.. చేసేవి డాష్ డాష్ పనులు.. అంటూ మంచు ఫ్యామిలీ మీద సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతోంది.