Crime News: ఈ రోజుల్లో బాలికల మీద అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బాలికలకు మాయమాటలు చెప్పి వారిని నమ్మించి వారి మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో ఇటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో దుష్ట శక్తులు తరిమికొడతానని తల్లి తండ్రులను నమ్మించి కూతురి మీద అత్యాచారం చేసిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భూపాల్ జిల్లాలో హబీబ్ గంజ్ కు చెందిన ఒక పండ్ల వ్యాపారి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ల వ్యాపారం చేసే ఒక వ్యాపారవేత్త ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను నమ్మించి అదృష్టాన్ని తెస్తానని నమ్మించాడు. కరోనా సమయంలో వ్యాపారంలో నష్టాలు రావటంతో అతని మాటలు నమ్మారు. బాధితురాలి తండ్రి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ వ్యాపారం చేయగా.. తల్లి ఒకప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తోంది.
ఇంట్లో ఉన్న దుష్టశక్తులు తొలగిపోవాలంటే ప్రత్యేక ప్రార్థనలు చేయడం చాలా అవసరం అని వారిని నమ్మించాడు. ఈ క్రమంలో రెండు సార్లు బాధితురాలి ఇంటికి వచ్చి ప్రత్యేక పూజలు చేసే సమయంలో ఒక్కో రోజు ఒక్కో గదిలో ఉండాలని చెప్పారు. అలా బాలిక మీద అత్యాచారం చేయటానికి ప్రయత్నిస్తూ ఆమె ఒప్పుకోకపోతే తల్లిదండ్రులను ప్రేతాత్మ వహిస్తుందని భయపెట్టి వారానికి రెండు సార్లు ఆమె మీద అత్యాచారానికి పాల్పడే వాడు. కొంతకాలం తర్వాత అతడి ప్రవర్తన కు చెందిన బాలిక తన తల్లిదండ్రులకు జరిగిన విషయం మొత్తం వివరించింది. దీంతో తల్లిదండ్రులు తాము మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.