ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఒక వ్యక్తి తన కూతుర్ని హత్య చేసి జైలుకు వెళ్లాడు. కరోనా మహామారి నేపథ్యంలో పెరొల్ పై బయటికి వచ్చాడు. అయితే తిరిగి జైలుకు వెళ్లకూడదని ఆ వ్యక్తి మాస్టర్ ప్లాన్ వేశాడు.ఈ క్రమంలోనే మరొక హత్య చేసి ఆ మృతదేహం తనదే అని నమ్మించే ప్రయత్నం చేశాడు. అది కాస్త ఫెయిల్ అవ్వడంతో పోలీసులకు దొరికిపోయాడు.ఈ దారుణానికి సహకరించిన తన భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 20న ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఒక వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు .
అయితే అతని ముఖం కాలిపోయి ఉండడంతో మృతదేహం ఎవరిదని గుర్తు పట్టలేకపోయారు. అతని దుస్తులు ఆధారంగా తనిఖీ చేయగా అతను సుదేశ్ అని తెలిసింది. అతని దుస్తులలో తన ఆధార్ కార్డు దొరకగా అందులోని సమాచారాన్ని తన భార్యకు అందించగా ఆమె తన భర్త అనే మృతదేహం గుర్తించింది. మరోవైపు పోలీసులు సుదేష్ బ్రతికే ఉన్నాడని గుర్తించారు. దీనితో అతని ఇంటి పరిసర ప్రాంతాలలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా అతని పోలికలు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని సైకిల్ పై తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. సుదేష్ తన భార్యను కలిసేందుకు వచ్చినట్లు పోలీసులు తెలుసుకున్నారు.
దీనితో అతని ఇంటిని తనిఖీ చేసి సుధేష్ ని పట్టుకున్నారు. అనంతరం అతన్ని పోలీసులు అరెస్టు చేసి విచారించగా జరిగినదంతా వివరించాడు. 2018లో తన 13 ఏళ్ల కూతుర్ని చంపిన అందుకు జైలు శిక్ష పడిందని తెలిపాడు. పెరోల్ గడువుముగుస్తుండటంతో తిరిగి జైలుకు వెళ్లకుండా తప్పించుకునేందుకు ఈ ప్లాన్ వేసినట్లు తెలిపాడు. ఇంట్లో పని కోసం వచ్చిన కూలికి మద్యం తాగించి ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పాడు. దీనితో ఈ కుట్రలో భాగమైన అతని భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక చనిపోయిన ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు అతని మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు. ఈ కేసులో తెలివిగా ప్రవర్తించిన పోలీసు బృందాన్ని ఘజియాబాద్ రూరల్ ఎస్పీ ఇరాజ్ రాజా వారిని అభినందించి వారికి రివార్డు ను ప్రకటించాడు.