Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పోలీస్ కేసు నమోదు అయ్యింది. అయితే ఇటీవల ఈయన నటించిన హరిహర వీర మల్లు సినిమా విడుదల అయి మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవ్వడమే కాకుండా ఈయన పట్ల పోలీస్ కేసు కూడా నమోదు అయింది. నిజానికి హరిహర వీరమల్లు సినిమా విడుదల ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక విధంగా ఈ సినిమాపై పెద్ద ఎత్తున నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ వస్తున్నారు.
సినిమా విడుదల సమయంలో థియేటర్లను బంద్ చేయాలని పిలుపునివ్వడం అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఇలా ఈ సినిమాకు అడుగడుగునా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ.. ఎవరైనా సినిమాల విషయంలో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అలాంటి వారిని వదిలిపెట్టకూడదని తిరిగి ఎదురుదాడి చేయాలి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు అయితే ఆ విషయాన్ని ఆయన మరచిపోయి ఇలా దాడులు చేయాలి అంటూ మాట్లాడటం చాలా దారుణంగా ఉందని ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు కాదు అంటూ ఈయన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే కాకుండా వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలి అంటూ కేసును నమోదు చేశారు. రాష్ట్రంలో ఒక మంచి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇలా ప్రజలను రెచ్చగొట్టడం,శాంతి భద్రతలకు విగాథం కలిగించేలా మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. పవన్ కళ్యాణ్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తాడేపల్లి పిఎస్ లోఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు కావడం ఎంతటి వివాదాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.
