Aryan Khan: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు పై మలయాళ హీరో సంచలన వ్యాఖ్యలు..?

Aryan Khan: బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయం ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. 2021 అక్టోబర్ 3న క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ స్వాధీనం కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 30న బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక అప్పట్లో ఈ కేసు అన్ని సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసు విషయంలో పలువురు సెలబ్రిటీలు ఆర్యన్ ఖాన్ కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.

కానీ సౌత్ ఇండస్ట్రీ కి సంబంధించిన ఏ ఒక్కరు కూడా ఈ కేసు విషయంలో నోరు మెదపలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఫై మలయాళ హీరో సంచలన వ్యాఖ్యలు చేశాడు. సౌత్ హీరో టోవినో థామస్ చేసిన వాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. షారుక్ ఖాన్ పేరును డ్యామేజ్ చేయడానికి రాజకీయంగా కుట్ర జరిగిందని, ఇదే విషయాన్ని ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీనితో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయం మరొకసారి తెరపైకి వచ్చింది.