రెండె పెళ్లికి సిద్ధ‌మైన క్రేజీ క‌పుల్‌.. బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారిన వార్త‌

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీల జంటల పెళ్ళిళ్ళు జోరందుకున్నాయి. అనుష్క శర్మ, విరాట కోహ్లీ ని పెళ్ళి చేసుకుంది. అలాగే దీపికా పడుకొనే, రణ్ వీర్ సింగ్ లు పెళ్ళి చేసుకున్నారు. ఆలియా భట్, రణ్ బీర్ కపూర్ లు నెక్ట్స్ లిస్ట్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా బాలీవుడ్ హాట్ పెయిర్ గా గుర్తింపు పొందిన అర్జున్ కపూర్, మలైకా అరోరాల పెళ్ళెప్పుడు అనే వార్తలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అటు మీడియాలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ వీరిద్దరి పెళ్ళి విషయంలో క్లారిటీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. ఏదైనా ఇంటర్వ్యూలో పలకరిస్తే తాము ఇలా హ్యాపీగానే ఉన్నామని.. ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఆలోచనలు లేవంటూ మాట దాటేస్తున్నారు.


రీసెంట్ గా నూతన సంవత్సర వేడుకల్లో గోవా బీచ్ లో అమృతా అరోరా ఇంటికి వెళ్ళిన ఈ హాట్ పెయిర్.. అక్కడ చేసిన రొమాన్స్, యోగా ట్రీట్ తో ఫ్యాన్స్ కి పెద్ద ట్రీటే ఇచ్చారు. ఎప్పటికప్పుడు పార్టీలు.. ఈవెంట్లంటూ చిల్ అయిపోతుంటారు. అంతేకాదు వాళ్ళు తీసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. రకరకాల ప్లేసెస్ కి.. కొత్త కొత్త ప్రాంతాలకు సమయం, సంధర్భం లేకపోయినా షికార్లు చేస్తుంటారు అర్జున్. మలైకా లు.
అయితే ఇప్పుడు ఈ జంటకు పెళ్ళి చేసుకోవాలనిపించిందంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. వీరి సన్నిహిత వర్గాల వీరి పెళ్ళికి టైమ్ వచ్చేసిందంటున్నాయి. అర్జున్, మలైకా ల పెళ్ళి ఏప్రిల్ నెలలో ఉంటుందని.. దీని కోసం డేట్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నారని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటించే సూచనలు కూడా కనిపిస్తున్నాయని తెలుస్తుంది.

మలైకా అరోరా తన మొదటి భర్త నుండి విడిపోయిన విషయం తెలిసిందే. అప్పటినుండి అర్జున్ కపూర్ తో లవ్ లో ఉంటున్నారు. ఈ జంట పెళ్లికి మలైకా కొడుకు అర్హన్ ఖాన్ అంగీకరించారని.. నెట్టింట్లో గాసిప్స్ వినిపించాయి.