బాక్సాఫీస్ :  “మేజర్” తో మొదటి రోజే శేష్ కెరీర్ లోనే భారీ వసూళ్లు.!

దాదాపు ఒక బయో పిక్ సినిమాలు అన్ని హిట్ రేషియో లోనే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ హిట్ లిస్ట్ లో మన టాలీవుడ్ నుంచి వచ్చిన ఇంట్రెస్టింగ్ బయోపిక్ చిత్రం “మేజర్” కూడా ఒకటి. దర్శకుడు శశికిరణ్ తిక్క టాలెంటెడ్ హీరో అడివి శేష్ లు నటించిన ఈ చిత్రం ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ ని సంతరించుకుంది.
అయితే హిందీ వసూళ్లు పక్కన పెడితే ఓవరాల్ గా మాత్రం ఈ సినిమాకి అడివి శేష్ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ అందుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా మొదటి రోజే అడివి శేష్ కెరీర్ లోనే అత్యధిక నంబర్స్ అందుకుంది. అయితే చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసిన నెంబర్ తోనే ఫస్ట్ డే ఈ సినిమా 13.4 కోట్లు గ్రాస్ ని ప్రపంచ వ్యాప్తంగా అందుకుందట.
ఇది ఒక మంచి నెంబర్ ని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అలాగే హిందిలో అయితే ఈ సినిమా బెటర్ అవ్వాల్సి ఉందని అంటున్నారు. అక్కడ ఈ చిత్రానికి కేవలం 96 లక్షలు మాత్రమే నెట్ వసూళ్లు వచ్చాయట. ఎలాగో ఇప్పుడు టాక్ బాగుంది కాబట్టి ముందు రోజుల్లో స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా మహేష్ బాబు, సోనీ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.