మీ పాలనలో ఏపీ మరింత అభివృద్ధి చెందాలి .. సీఎం వైఎస్ జగన్ కి మహేష్ బర్త్ డే విషెష్ !

mahesh babu cm jagan

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సీఎం జగన్‌ జన్మదినం పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు సోమవారం తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాల చేపట్టారు. విప్లవాత్మక నిర్ణయాలు, చరిత్రాత్మక పథకాలతో అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొన్న సీఎం.. ఏడాదిన్నర కాలంలోనే 90 శాతం హామీలు నెరవేర్చిన విషయం తెలిసిందే.

good news to ap cm jagan on behalf of ycp
 

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టగా, అది వైరల్ అవుతోంది. “గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ దూరదృష్టి, కృషి ఏపీని మరింత అభివృద్ధిలోకి నడిపించాలి.

మీరు ఆయురారోగ్యాలతో, నిత్యమూ సంతోషంగా ఉండాలి అని ఆకాంక్షించారు. బర్డ్ డే జరుపుకుంటున్న జగన్ కు ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు సెలబ్రిటీలు విషెస్ చెబుతున్నారు.