Madhavi Latha: సినీనటి మాధవి లత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి మధ్య గత కొద్దిరోజులుగా ఒక వివాదం చోటు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఎవరు కూడా జేసీ పార్కు వద్దకు వెళ్లదు అంటూ సినీనటి బిజెపి మహిళ నేత మాధవి లతా చేసిన వ్యాఖ్యలపై ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలా ఒకరిపై మరొకరి విమర్శలు చేసుకున్నా అనంతరం జెసి ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు కూడా చెప్పారు.
ఇలా ఈ వివాదం ఇంతటితో ముగిసింది అనుకొనేలోపు మరోసారి మాధవి లతకు గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈమెపై పోలీస్ కేసు నమోదు అయింది. మాధవి లతా తాడిపత్రి మహిళలను ఉద్దేశించి చాలా తప్పుగా మాట్లాడారు అంటూ ఈమెపై ఆంధ్రప్రదేశ్ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ కేసు నమోదు చేశారు.ప్రస్తుతం ఈ విషయం విని మాధవి లత అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ విషయం సంచలనంగా మారింది.
ఇక జెసి ప్రభాకర్ రెడ్డి మాధవి లత మధ్య చోటు చేసుకున్న ఈ వివాదమే మాధవి లత పై పోలీస్ కేసు పెట్టడానికి కారణమని తెలుస్తుంది.జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఫిలిం ఛాంబర్ తో పాటు మానవ హక్కుల సంఘానికి అలాగే పోలీసులకు మాధవి లత ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తన మీద చాలా దారుణంగా మాట్లాడారని, తన మీద వచ్చిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ కూడా ఖండించలేదు. అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి కూడా ఈమె ఫిర్యాదు చేశారు.
ఇలా మహిళలను ఉద్దేశించి ప్రభాకర్ రెడ్డి తప్పుగా మాట్లాడటంతో ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తనకు ఎవరూ కూడా మద్దతు తెలుపలేదు అంటూ అప్పట్లో ప్రభాకర్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో విమర్శించడంతో ప్రభాకర్ రెడ్డి కూడా క్షమాపణలు చెప్పారు కానీ అంతా సర్దుమనిగే లోపు మరోసారి మాధవి లత పై తాడిపత్రిలో కేసు నమోదు కావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి రివెంజ్ తీర్చుకోవడం కోసమే ఇలా తనపై కేసు పెట్టించారనీ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు మరి ఈ విషయంపై మాధవి లత స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.