Madhavi Latha: నేనేం అన్యాయం చేశాను… నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు…. కన్నీళ్లు పెట్టుకున్న మాధవి లత!

Madhavi Latha: సినీనటి మాధవి లత ముక్కుసూటి మనిషి అని చెప్పాలి ఈమె ఏ విషయం అయినా నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఇలా నటిగా పలు సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం బిజెపి పార్టీలో కొనసాగుతున్నారు అయితే ఇటీవల ఈమె టిడిపి సీనియర్ నేత జెసి ప్రభాకర్ రెడ్డి మధ్య భేదాభిప్రాయాలు చోటు చేసుకోవడంతో జెసి ప్రభాకర్ రెడ్డి ఈమెపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

డిసెంబర్ 31వ తేదీ రాత్రి మహిళలు ఎవరు కూడా జెసి పార్క్ వైపు వెళ్లదు అంటూ ఈమె మహిళలకు సూచనలు తెలియజేస్తూ ఒక వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో పై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.బీజేపీ నేతలు హిజ్రాల కన్నా దారుణంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహిళలను కించపరిచేలా ఆమె మాటలు ఉన్నాయంటూ మండిపడ్డారు. జేసీ పార్క్‌లో ఎలాంటి దారుణ సంఘటనలు జరగడం లేదని క్లారిటీ ఇచ్చారు. మాధవీలత ప్రాస్టిట్యూట్, వేస్ట్ ఫెలో అంటూ జేసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలా తన గురించి చేసిన వ్యాఖ్యలపై మాధవి లత ఘాటుగా స్పందించారు. సినిమాలలో నటించేవాళ్లంతా వ్యభిచారులు కాదని అలాగైతే తాడిపత్రి వాళ్లంతా పతివ్రతల అంటూ ప్రశ్నించారు. నన్ను చంపేసిన పర్వాలేదు నేను మహిళల కోసమే పోరాటం చేస్తానని ఈమె తెలిపారు. అంతేకాకుండా బీజేపీ మహిళా నేతల గురించి జెసి ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకుల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో ఆయన చివరకు క్షమాపణలు తెలియజేశారు.

నటి మాధవి లత గురించి నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అంటూ ఆయన క్షమాపణలు చెబుతూ ఒక వీడియోని విడుదల చేశారు. అయితే తాజాగా నటి మాధవి లత ఫేస్బుక్ ద్వారా లైవ్ వీడియో చేశారు. అయితే లైవ్ లోనే ఈమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయ్యారు.చాలా ప్రయత్నించానని , కానీ నేను కూడా మనిషినేనంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నోసార్లు, ఎందరో నా ఆత్మ విశ్వాసాన్ని చిదిమేయాలని ప్రయత్నించారంటూ కానీ మగాడిలా పోరాడుతున్నానని మాధవీ లత అన్నారు. నేను హిందూ ధర్మం, మహిళలు, పార్టీ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పోరాటం చేస్తున్నాను నేను ఎవరికీ ద్రోహం చేయలేదు కానీ నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ ఈమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Madhavi Latha Gets Emotional  | JC Prabhakar Reddy vs Madhavi Latha |  BJP Leader