అనిత, ప్రఖ్యాంత్ సమర్పణలో ఎస్‌ఎమ్ఆర్ ఐకాన్ ఫిల్మ్స్, ప్రణ్వీ పిక్చర్స్ బ్యానర్లపై డా. విశ్వానంద్ పటార్, ఆద్య, నిహాంత్, దివ్య, రాజేష్, భావన హీరోహీరోయిన్లుగా.. డా. విశ్వానంద్ పటార్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాట్స్ ఆఫ్ లవ్’. సెప్టెంబర్ 30న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి శ్రీరంగం సతీష్, ప్రత్తిపాటి శ్రీనివాసరావు, ఎస్ఎమ్ఆర్ ఐకాన్ ఫిల్మ్స్ అధినేత సోమేశ్వర్ రాజుతో పాటు చిత్రయూనిట్ మొత్తం పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఎస్ఎమ్ఆర్ ఐకాన్ ఫిల్మ్స్ అధినేత సోమేశ్వర్ రాజు మాట్లాడుతూ.. ”నేను, విశ్వానంద్ మంచి స్నేహితులం. ఈ సినిమా కథ నచ్చి నేను కూడా భాగస్వామిని కావడం జరిగింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ నెల 30న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము. ఇందులో మంచి కంటెంట్ ఉంది.. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను..” అన్నారు.
హీరో రాజేష్ మాట్లాడుతూ… టైటిల్‌కు తగ్గట్టుగా ఇందులో చాలా ప్రేమ ఉంది. అది అందరికీ నచ్చుతుంది. ఆడిషన్స్‌కు చాలా మంది వచ్చినా.. నేను చేసిన పాత్రకు నేనే కరెక్ట్ అని భావించి ఈ ఆఫర్ ఇచ్చిన విశ్వగారికి ధన్యవాదాలు. నాతో పాటు నటించిన నటీనటులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..” అని చెప్పారు. శ్రీరంగం సతీష్ మాట్లాడుతూ.. ”తెర వెనుక.. అలాగే తెర ముందు విశ్వానంద్‌గారి కష్టం కనబడుతుంది. ఆయన పట్టుదల వల్లే ఈ సినిమా ఇంత త్వరగా ఇక్కడి వరకు చేరుకుంది.
కథకు తగట్టు మంచి పాత్రలను తీసుకున్నారు. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో 100 థియేటర్లలో.. యూఎస్‌లో 4 థియేటర్లలో విడుదలకు అన్ని పూర్తయ్యాయి. ముందు ముందు ఇంకా థియేటర్లు పెరిగే అవకాశం ఉంది. మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుతున్నాను” అన్నారు. డా. విశ్వానంద్ పటార్ మాట్లాడుతూ.. ”అందరికీ లాట్స్ ఆఫ్ థాంక్స్ చెప్పాలి ఫస్ట్. సినిమా పూర్తి చేయడం అంత ఈజీ కాదు. కిరణ్, సతీష్‌గారు లేకపోతే ఇంతదాకా వచ్చేది కాదు.. ఇక సినిమా విషయానికి వస్తే.. 5 స్టోరీస్ ఉంటాయి.
కోవిడ్ టైం లో చేశాము. చిత్రీకరణ చాలా కష్టమైంది కానీ.. వెనక్కి తగ్గకుండా సినిమాని పూర్తి చేశాము. లేడీస్‌కు ఈ సినిమా పక్కాగా నచ్చి తీరుతుంది. పిల్లలతో కలిసి చూసే సినిమా ఇది. సాంగ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. టికెట్స్ రేట్స్ కూడా తగ్గిస్తున్నాము. నాకు ఈ సినిమా నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాము ” అన్నారు. డా. విశ్వానంద్ పటార్, ఆద్య, నిహాంత్, దివ్య, రాజేష్, భావన తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: విశ్వ, ఎడిటర్స్: శ్రీనివాస్, నాగిరెడ్డి, సినిమాటోగ్రఫీ: మురళీ, నగేష్, కుమార్, పిఆర్‌ఓ: బి. వీరబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డా. బి.కె.
కిరణ్ కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, నిర్మాత, దర్శకత్వం: డా. విశ్వానంద్ పటార్.