Kodali Nani: కొడాలి నానికి బిగ్ షాక్ ఇచ్చిన కూటమి సర్కార్…. లుక్ అవుట్ నోటీసులు జారీ!

Kodali Nani: వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నానికి కూటమి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో నాని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు ప్రాంతాలలో కొడాలి నాని పై కేసులు నమోదు అయిన విషయం మనకు తెలిసిందే.

ఇప్పటికే వైసీపీ పార్టీకి చెందిన పలువురిని అరెస్టు చేశారు. తాజాగా కొడాలి నానికి సైతం కూటమి సర్కారు ఊహించని షాక్ ఇచ్చిందని చెప్పాలి. కొడాలి నాని పై ఇప్పటికే కేసులు నమోదయి తనని అరెస్టు చేయాల్సి ఉండగా కొడాలి నాని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఈయనకు బైపాస్ సర్జరీ చేసిన నేపథ్యంలో ముంబైకి పరిమితం అయ్యారని తెలుస్తుంది..

ఇకపోతే కొడాలి నాని కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే ఇలా చేస్తున్నారని వాదన కూడా వినిపిస్తున్న నేపథ్యంలో కూటమి సర్కార్ నానిపై లుక్ అవుట్ నోటీసులను జారీ చేసింది. పలు కేసుల్లో నిందితునిగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నానిపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ అయ్యాయి.ఈ నోటీసులు ఆన్‌లైన్‌ ద్వారా అన్ని ఎయిర్‌పోర్టులు, ఓడరేవులకు అందాయి. వాస్తవానికి కొడాలి నానికి రాష్ట్రంలో పాస్‌పోర్టు లేదు. రైతు మోషే కేసులో జైలుశిక్ష ఖరారుకావడం, పలు కేసుల్లో నిందితునిగా ఉండటంతో ఆయనకు పాస్‌పోర్టు జారీ కాలేదు. అయితే, హైదరాబాద్‌ చిరునామాతో పాస్‌పోర్టును కలిగి ఉన్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటి తరుణంలోనే నాని పై ఆన్లైన్ ద్వారా లుక్ అవుట్ నోటీసులను జారీ చేశారు. నాని ఈ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం అమెరికా పరారయరని సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.కృష్ణాజిల్లా గుడివాడ పరిధిలో నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. వలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన, విశాఖపట్నంలో కేసుకు సంబంధించి నాని ముందస్తు బెయిల్‌ పొందారు.గుడివాడ మండలం మల్లాయిపాలెం జగనన్న కాలనీకి మెరక పేరుతో రూ.కోట్లు దోపిడి చేసిన వ్యవహారంలో నాని పై కేసులు నమోదు అయ్యాయి. ఏ క్షణమైనా నాని అరెస్టు కావచ్చని స్పష్టమవుతుంది.