బిర్యానీ అంటే ఎంత ఇష్టం ఉంటే మాత్రం ఏకంగా ఒకటిన్నర కిలోమీటర్ల క్యూ కడతారా? అది కూడా కరోనా టైమ్ లో.. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా.. ప్రాణాలకన్నా బిర్యానీయే ముఖ్యమా? అని అనాలనిపిస్తోంది కదా. అసలు విషయం తెలిస్తే మీరు కూడా వెళ్లి అక్కడ లైన్ లో నిలుచుంటారు.
నిజానికి కరోనా సమయంలో బయటి ఆహారం తినకూడదని.. సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ చెబుతున్నారు కానీ.. పాటించేవాళ్లు కరువయ్యారు. కరోనా భయమే లేదు జనాలకు. వీళ్లు చూడండి.. బిర్యానీ కోసం కరోనా వచ్చినా పర్లేదు అన్నట్టుగా లైన్ లో నిలుచున్నారు.
వాళ్లు నిలుచున్నది కేవలం బిర్యానీ కోసమే. అది కూడా 1.5 కిలోమీటర్ల క్యూ కట్టి మరీ. కరోనాతో గత కొన్ని నెలల నుంచి అన్నీ మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే ఫుడ్ ఇండస్ట్రీ కూడా నెమ్మదిగా ప్రారంభం అవుతోంది. రెస్టారెంట్లు కూడా తెరుచుకుంటున్నాయి.
అలాగే బెంగళూరుకు సమీపంలోని ఆనంద్ దమ్ బిర్యానీ హౌస్ కూడా లాక్ డౌన్ తర్వాత ఇప్పుడే తెరుచుకుంది. నిజానికి.. ఆనంద్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ లో బిర్యానీ చాలా ఫేమస్. రోజూ అది ఎంతో బిజీగా ఉంటుంది. ఆ రెస్టారెంట్ లో బిర్యానీ తినడానికే జనాలు ఎక్కడి నుంచో వస్తారట. అటువంటి బిర్యానీ రుచిని కరోనా వల్ల అక్కడి జనాలు గత కొన్ని నెలల నుంచి ఆస్వాదించలేకపోతున్నారు.
ఎప్పుడు ఆ రెస్టారెంట్ తెరుస్తారా? అన్ని కళ్లలో వత్తులు వేసుకొని చూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది. చివరకు ఆ రెస్టారెంట్ ను తెరిచారు. ఇక జనాలు ఊరుకుంటారా? వెంటనే బిర్యానీని టేస్ట్ చేయడానికి రెస్టారెంట్ కు పరుగులు తీశారు. దీంతో అక్కడ క్యూ ఎంత పెద్దదిగా మారిందో మీరే చూశారుగా. అంత పెద్ద క్యూ ఉన్నప్పటికీ.. ఎవ్వరూ ఏమాత్రం చిరాకు పడకుండా… బిర్యానీ కోసం లొట్టలేసుకుంటూ లైన్ లో నిలుచున్నారు.
ఇక.. అటువైపు వెళ్తున్న వాహనదారులు మాత్రం ఈ లైన్ ను చూసి నోరెళ్లబెడుతున్నారు. బిర్యానీ కోసం ఇంత క్యూనా? అని.. ఓ వాహనదారుడు.. ఏకంగా ఆ క్యూను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Queue for biryani at Hoskote, Bangalore. Send by @ijasonjoseph
Tell me what biryani this is and is it free? pic.twitter.com/XnUOZJJd2c— Kaveri 🇮🇳 (@ikaveri) September 26, 2020