Benguluru: బెంగళూరు చిన్న స్వామి స్టేడియం వద్ద తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఐపీఎల్ ఫైనల్ లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది దాదాపు 18 సంవత్సరాల తర్వాత ఐపీఎల్లో విజయం సాధించిన నేపథ్యంలో అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కప్పు గెలుకున్న ఆర్సీబీ టీమ్ బెంగళూరు చేరుకున్నారు. ఈ క్రమంలోనే వారికి స్వాగతం పలకడం కోసం లక్షలాదిమంది అభిమానులు ఒక్కసారిగా తరలివచ్చారు.
ఈ విధంగా లక్షల సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో ఒకసారిగా తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో ఏకంగా 11 మంది మరణించగా పదుల సంఖ్యలో అభిమానులు గాయాలు పాలయ్యారు. ఇలా మరణించిన వారిలో చిన్న పిల్లలు ఉండటం బాధాకరం. ఇలా ఈ ఘటనలో 11 మంది మరణించడంతో ఎంతోమంది ఈ ఘటనపై తీవ్రస్థాయిలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ ఘటనపై స్పందించారు.
బెంగళూరు తొక్కిసలాట ఘటనలో భాగంగా 11 మంది మరణించడం బాధాకరం అని తెలిపారు.ఈ ఘటన చాలా హృదయ విదారకమైనదని పేర్కొన్నారు. మరణించిన వారిలో పిల్లలు కూడా ఉండటం మరితం బాధిస్తోందని అన్నారు. వేడుకలు చేసుకోవాల్సిన సమయం ఇంత విషాదంగా మారడం చాలా దురదృష్టకరం అని పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇక గాయాలు పాలైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్పందించారు. మరణించిన మృతుల కుటుంబాలకు రెండు లక్షలు ఎక్స్క్రీషియా ప్రకటించారు. గాయాలు పాలైన వారికి 50 వేల రూపాయలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన గురించి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు. విధుల్లో 5వేల మంది పోలీసులు ఉన్నారని తెలిపారు. మృతులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. లక్షలాది మంది అభిమానులు తరలివచ్చారని,ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో పరిస్థితి అదుపు తప్పిందని తెలియజేశారు.