ఎన్టీఆర్ విగ్ర‌హం ఏర్పాటులో లోకేష్ వాద‌న క‌రెక్టేనా?

నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క వ‌ర్గం ముసునూరు గ్రామంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ విగ్ర‌హం కూల్చివేత‌పై వైకాపా- టీడీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య పెద్ద వార్ న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో రెండు వ‌ర్గాలు బాహా బాహీకి దిగాయి. ఇరు పార్టీల నేత‌లు ఒక‌ర్ని ఒక‌రు దూషించుకుని కొట్టుకున్నారు. ఇందులో ఐదుగురు టీడీవీప వ‌ర్గియుల‌కు దెబ్బ‌లు తిగిలాయి. ఈ వివాదంలో పెద్ద‌ల ముందు ఎవ‌రి వాద‌న‌లు వారు వినిపించారు. ముసునూరు లో ఎన్టీఆర్ విగ్ర‌హం వీపు భాగం ఆల‌యం ఎదురుగా ఉంద‌ని అందువ‌ల్లే స్థానికులు తొల‌గించార‌ని వైకాపా నాయ‌కు లు చెబుతున్నారు.

ఆ స్థ‌లానికి బ‌ధులుగా వివాదాస్ప‌దం కాని స్థ‌లంలో విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తామ‌ని మాటిచ్చారు. కానీ టీడీపీ నాయ‌కులు ఒప్పుకోవ‌డం లేదు. ఎందుకు కూల్చారు? కూల్చిన చోటే మ‌ళ్లీ కొత్త విగ్ర‌హం క‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఉపేక్షించేది లేద‌ని హెచ్చ‌రించారు. మ‌రి ఈ వాద‌న క‌రెక్ట‌నా? లేక టీడీపీ మొండి ప‌ట్టుద‌ల‌కు పోతుందా? అంటే రెండ‌వ దాన్నే ఖాయం చేసుకోవాల్సిన ప‌రిస్థితి. ఏ రెండు రాజ‌కీయ పార్టీల మ‌ధ్య ఎప్పుడు పొస‌గ‌దు. రాజ‌కీయ పార్టీలు అన్నాక ఇలాంటి వివాదాలు స‌హ‌జ‌మే. కానీ మొంకి ప‌ట్టుద‌లే అర్ధ ర‌హితంగా ఉంద‌ని వైకాపా నాయ‌కులు మండిప‌డుతున్నారు.

కొత్త విగ్ర‌హం ఏర్పాటు చేస్తామ‌న్నా టీడీపీ వాగ్వివాదానికి దిగ‌డం స‌మంజ‌సం కాద‌ని హిత‌వు ప‌లికారు. తాజాగా ఈ ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి లోకేష్ గాయ‌ప‌డిన టీడీపీ నాయ‌కులుతో మాట్లాడారు. త‌మ పార్టీ నాయ‌కుల‌పై అక్ర‌మంగా కేసులు బ‌నాయించారని, విగ్ర‌హం కూల్చివేత వెనుక రాజ‌కీయ కుట్ర దాగి ఉంద‌ని ఆరోపించారు. బాధితుల్ని అన్ని విధాలుగా అండ‌గా ఉంటామ‌న్నారు. అలాగే అన్న‌గారి విగ్ర‌హాన్ని కూల్చిన చోటే మ‌ళ్లీ ఏర్పాటు అవుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేసారు. ఇది అన్న గారి మ‌న‌వ‌డు ఇస్తున్న మాట అని లోకేష్ తెలిపారు.