ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రాజ్యాంగ పదవిలో ఉంది కూడా పార్టీ తరుపున వకాల్తా పుచ్చుకొని మాట్లాటం ఒక్క తమ్మినేనికే చెల్లింది. తాజాగా ఆయన సొంత ఇంట్లో రాజకీయ కుంపటి రాజుకుంది. ప్రస్తుతం ఆంధ్ర లో పంచాయితీ ఎన్నికల హడావిడి జరుగుతుంది. అయన కుటుంబంలో స్థానిక ఎన్నికలు చిచ్చు పెట్టాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.
తమ్మినేని సీతారాం నియోజకవర్గం ఆముదాల వలసలోని తొగరాం పంచాయతీకి బుధవారం.. మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ పంచాతీయ ఎన్నికలు.. తమ్మినేనికి తల భారంగా భావిస్తున్నారు. ఇంటా బయటా కూడా ఆయనకు ఇది అగ్ని పరీక్షగా మారింది. ఒక్కోసారి ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ చేసుకునే పరిస్థితి వచ్చినట్లు తెలుస్తుంది. తొగరాం పంచాయతీకి తమ్మినేని సీతారాం సతీమణి.. తమ్మినేని వాణి నామినేషన్ వేశారు. ఆమెకు వైసీపీ సంపూర్ణ మద్దతు లభించింది. వాస్తవానికి ఇక్కడ ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే.. అనూహ్యంగా తమ్మినేని సొంత అన్న.. దివంగత తమ్మినేని శ్యామలరావు సతీమణి.. భారతమ్మ.. బరిలో నిలిచారు. ఈమెకు టీడీపీ పరోక్షంగా మద్దతిస్తోంది.
అయితే భారతమ్మ కు సొంత కొడుకు కూడా మద్దతు ఇవ్వటం లేదు. తమ్మినేని సీతారాం ఒక వ్యూహం ప్రకారమే తల్లి నుండి కొడుకును దూరం చేసినట్లు తెలుస్తుంది. అదే విధంగా భారతమ్మ తరఫున ఎవరూ ప్రచారం చేయకుండా నిలువరించడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఒకవైపు.. తమ్మినేని వాణి.. భారీ ఎత్తున మందీ మార్బలంతో ప్రచారం చేస్తుండగా.. భారతమ్మ మాత్రం.. ఒక్కత్తే ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు ఆమె కుమారుడు.. తల్లికి దూరంగా ఉంటూ.. నామినేషన్‌ను వెనక్కి తీసుకోవాలని సైతం తల్లినే హెచ్చరిస్తున్నాడు.
తమ్మినేని వ్యవహార శైలిపై ఇప్పుడు శ్రీకాకుళంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సొంత వదిన విషయంలో ఈ విధంగా చేయటాన్ని కొందరు తప్పు పడుతున్నారు. ఒక వేళా ఆ వ్యతిరేకత ఎన్నికల్లో చూపిస్తే తమ్మినేనికి చుక్కలు కనిపించటం ఖాయం. `