ఆంధ్రాలో పాలక పక్షం వైసీపీకి, ప్రతిపక్షం టీడీపీకీ మధ్యన సీట్ల వ్యత్యాసం చాలానే ఉంది. 151 సీట్లతో జగన్ తులతూగుతుంటే కేవలం 23 సీట్లతో చంద్రబాబు నాయుడు వెలవెలబోతున్నారు. ఇక పాలనలో కూడ జగన్ మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంటున్నారు. గడిచిన ఏడాదిలో ఆయన మీద ప్రజల్లో మంచి పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడింది. అయితే కొన్ని వర్గాల్లో పాలక పార్టీ మీద వ్యతిరేకత కూడ ఉంటోంది. అవే అభివృద్ధిని కోరుకునే వర్గాలు. తమవరకు రాని సంక్షేమ పథకాల మీద వీరికి ఇంట్రెస్ట్ ఉండదు. తమకు మంచి చేసే అభివృద్ధి మీద, ఉద్యోగావకాశాల మీదే దృట్టి పెట్టి ఉంటారు. ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఏం సాధించింది అనేది ఈ అభివృద్ధి అనే సమీకరణం మీద ఆధాపడి ఉంటుంది.
తెలుగుదేశం పార్టీ అయితే జగన్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతిందని, ఆయన ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని, ఇకపై ఆ పార్టీకి భవిష్యత్తు లేదని అంటున్నారు. బీజేపీ సైతం ఇంకొద్దిరోజుల్లో జగన్ ప్రభుత్వం కూలుతుందని జోస్యం చెప్పారు. అమరావతిని కాదనడం, మూడు రాజధానులకు సిద్దమవడం, ఇంగ్లీష్ మీడియంలోనే పిల్లలు చదవాలని చెప్పడం, కోర్టుల ధిక్కరణ వెరసి జగన్ మీద నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయని చెబుతున్నారు. కొందరు విశ్లేషకులు సైతం ఇదే అంటున్నారు. పాలకపక్షం మీద వ్యతిరేక వర్గం ఎప్పుడూ ఉంటారు. వాళ్ళే ఇప్పుడు జగన్ కు భవిష్యత్తులో శత్రువులు కానున్నారని అనుకుంటున్నారు.
ఇలా రెండు అభిప్రాయాలతో జనం కన్ఫ్యూజ్ అవుతుండగా సరైన సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నికలు రానున్నాయి. ఇంకొన్ని నెలల్లో ఈ రెండు కూడ వెంట వెంటనే జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవాలని మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇలా చంద్రబాబు నాయుడైతే ఎన్నికల కోసం ఎంతో ఆతురతగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా గెలిచేస్తామని, అస్లు జమిలి ఎన్నికలు రావాలని అంటున్నారు. మొన్నామధ్యన వైసీపీ నేతలకు రాజీనామా సవాల్ కూడ విసిరారు. ఈ ఒకటిన్నర ఏడాదిలో మారిన పరిస్థితులకు ఈ రెండు ఎన్నికలే కొలమానం కానున్నాయి. అంతేకాదు 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇవి ట్రయల్స్ అనుకోవచ్చు. సో.. వచ్చే ఏడాది జరగబోయే ఈ రెండు ఎలక్షన్లు ఫ్యూచర్ లీడర్ ఎవరనేది చెప్పేస్తుండటంతో అధినేతలు ఇద్దరిలోనూ ఉత్కంఠ నెలకొని ఉంది.