బ్రేకింగ్: ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు

local-body-elections-in-andhra-pradesh

ఓ సంవత్సరం పాటు ఎటువంటి ఎన్నికల హడావుడి లేకుండా ఏపీ ప్రశాంతంగా ఉండింది. కానీ.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు జరగబోతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు.

local-body-elections-in-andhra-pradesh
local-body-elections-in-andhra-pradesh

మళ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోందట. ఏపీలో మూడు ఫేజ్ లలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ఏపీ ప్రధాన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సిద్ధమవవుతున్నారట. కేంద్రం ఎన్నికల కమిషన్ నుంచి కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట.

కరోనా దృష్ట్యా.. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా… ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఒక విడతగా… మున్సిపల్ ఎన్నికలను ఒక విడతగా…. పంచాయతీ ఎన్నికలను రెండు విడతలుగా నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం రెండు దఫాలుగా ఎన్నికలు ఉండనున్నాయి. దీంతో ఒక దఫాలో సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు నామినేషన్స్ ను స్వీకరించి.. 27న పోలింగ్, కౌంటింగ్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

రెండో దఫాలో సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు నామినేషన్లను స్వీకరించి… 29న పోలింగ్, కౌంటింగ్ ఉంటుందని తెలుస్తోంది.

మున్సిపల్ ఎన్నికల కోసం… సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు నామినేషన్స్, 23న పోలింగ్, 27న కౌంటింగ్ ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే.. అధికారికంగా ఏపీ ఎన్నికల కమిషన్ నుంచి మాత్రం ఎటువంటి సమాచారం అందలేదు. చూద్దాం.. రేపో మాపో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.