స్థానిక ఎన్నికల్లో ఓడినా కూడా బాబుకు మంచే జరగనుందిగా!!

ఏపీలో ఇప్పుడు స్థానిక ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ ఎన్నికలు జరగడానికి ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కి మధ్య ఎన్ని గొడవలు జరిగాయో అందరికి తెలుసు. అయితే ఇప్పుడు ఈ ఎన్నికలో గెలవడానికి అన్ని పార్టీల నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నాయకులు వైసీపీపై విజయం సాధించడం కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని ఆశిస్తున్నారు.

Cbn
cbn

టీడీపీ వైసీపీపై గెలుస్తుందా!!

2019 ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఘోరంగా ఓడిపోవడాన్ని తట్టుకోలేని చంద్రబాబు నాయుడు ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో గెలిచి, టీడీపీ మళ్ళీ అధికారంలోకి రానుందనే సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలని అనుకుంటున్నారు.కానీ వైసీపీ ఎలాగో అధికారంలో ఉంది కాబట్టి స్థానిక ఎన్నికల్లో వైసీపీదే పైచెయ్యి అవ్వనుందని రాజకీయ విశ్లేషకులు. చెప్తున్నారు. ఒకవేళ నిజంగా ప్రజలకు వైసీపీపై వ్యతిరేకత ఉంటే మాత్రం టీడీపీనే గెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఏపీలో బీజేపీ,జనసేన పొత్తులో ఉండటం వల్ల కూడా టీడీపీకి గట్టి పోటీ ఎదురు కానుంది. ఈ పోటీని తట్టుకొని టీడీపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

ఓడినా టీడీపీకి లాభమే

ఈ స్థానిక ఎన్నికల్లో టీడీపీకి తక్కువ స్థానాల్లో విజయం వరించినా కూడా టీడీపీకి లాభమేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటి వరకు టీడీపీ నాయకులు ఎక్కడ వైసీపీలోకి వెళ్తారోననే భయం బాబులో ఉండేది కానీ ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల వల్ల తమ వైపు ఉండేవారు ఎవరనే విషయం స్పష్టంగా తెలిసింది. దింతో కనీసం చంద్రబాబు నాయుడు యొక్క ప్రతిపక్ష పదవి అయిన పోకుండా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles