ఈ వారం ఎలిమినేషన్స్‌లో భాగంగా హౌస్ నుంచి లోబోని ఎలిమినేట్ చేసి, సీక్రెట్ రూమ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, సీక్రెట్ రూమ్‌లో లోబో ఎలా ఉన్నాడు.? బిగ్‌బాస్ హౌస్‌లో ఉండడమంటేనే కత్తి మీద సాము. అలాంటిది సీక్రెట్ రూమ్‌లో ఒంటరిగా ఉండడం అంటే గట్స్ ఉండాల్సిందే.
గతంలో రాహుల్ సిప్లిగంజ్, అఖిల్ సార్ధక్‌లు కూడా సీక్రెట్ రూమ్ ఎక్స్‌పీరియన్స్ చేశారు. కానీ, వాళ్ల సంగతి వేరు. లోబో సంగతి వేరు. హౌస్‌లో అంత మంది మధ్య ఉంటూనే లోబో చాలా హోమ్ సిక్ ఫీలయ్యాడు. ఇక ఒంటరిగా సీక్రెట్ రూమ్ అంటే.. పాపం లోబో.
అందుకే నాగార్జునతో చెప్పేశాడు. నా వల్ల కాదు సార్. నేనిక్కడ ఉండలేను. నన్ను ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించేయండి.. అనేశాడు. అంతేకాదు, హౌస్‌లో జరుగుతున్న సిత్రాలూ, నాటకాలూ తదితర అంశాలపై తన అభిప్రాయం వెల్లిబుచ్చాడు.
అబద్ధాలు చెప్పడం, నాటకాలాడడం, ఒకరి ముచ్చట ఇంకొకరి దగ్గర చెప్పడం.. వంటివి తనకు నచ్చవనీ, జెన్యూన్‌గా ఉండడమే తనకు తెలుసనీ నాగ్‌తో చెప్పిన లోబోని కన్విన్స్ చేయడం నాగార్జునకు తలకి మించిన కష్టమాయే. సొసైటీలో జరుగుతున్నవే హౌస్‌లో డిఫరెంట్ మెంటాలిటీస్ ఉన్న వ్యక్తుల మధ్య జరుగుతున్నాయి. అది చూపించడమే బిగ్‌బాస్ షో ఉద్దేశ్యం అని నాగ్ లోబోకి నచ్చ చెప్పాడు.