Y.S.Jagan: ఖాళీ అవుతున్న వైయస్ జగన్ కోటరీ… నెక్స్ట్ టార్గెట్ జగనే?

Y.S. Jagan: ఏపీలో గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున మద్యం కుంభకోణం జరిగిందని సిట్ అధికారులు విచారణలో తెలియజేశారు. దాదాపు 3200 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ లిక్కర్ స్కాంలో భాగంగా ఇప్పటికే 12 మందిని అరెస్టు చేశారు మరి ఆ 13వ వ్యక్తి ఎవరు అనే విషయంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ కుంభకోణంలో జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న వారందరూ కూడా అరెస్టు అయ్యారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి అలాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి అదే విధంగా ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డి లను ఇప్పటికే అరెస్టు చేశారు. జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వారు అనుకూలంగా వ్యవహరించిన వారు అరెస్ట్ అయ్యారు.

ఇకపోతే తాజాగా జగన్ కోటరీలో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక జగన్ కోటరీలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్ల కూడా పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఏ క్షణమైన వీరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇలా జగన్ కోటరీ మొత్తం ఖాళీ అవుతోది.

ఇక జగన్ అరెస్టు కూడా తాడేపల్లి ఇంటి గుమ్మం వరకు వచ్చే ఆగిపోయిందని సమాచారం అయితే ఈ లిక్కర్ స్కామ్ లో భాగంగా పలు సందర్భాలలో చార్జిషీట్లో జగన్ పేరును కూడా ప్రస్తావించారు. మిథున్ రెడ్డి అరెస్ట్ కావడంతో పలువురు తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు త్వరలోనే అతిపెద్ద తిమింగలం కూడా అరెస్ట్ అవుతుంది అంటూ పలువురు మంత్రులు మాట్లాడారు. అయితే వీరు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే మాట్లాడుతున్నారని స్పష్టమవుతుంది. మరి లిక్కర్ స్కామ్ లో భాగంగా జగన్ సైతం ఊచలు మరోసారి లెక్క పెట్టాల్సిందేనా? అరెస్టు కావడం తప్పదా అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉండకపోవచ్చు అని కేవలం విచారణ వరకు మాత్రమే తనని పిలుస్తారని తెలుస్తుంది ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తే ఆయనపై సింపతి పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉండకపోవచ్చునే పలువురు భావిస్తున్నారు.