లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అధికారికంగా జబ్బలు చరిచి భారత్ రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. చేసిన మోసాలన్ని మర్చిపోయి మళ్లీ భారత్ లో తన పాత కార్యకలాపాలు యధావిధిగా కొనసాగించాలని ఆశపడుతున్నాడు. ఆ దిశగా ఇండియా వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నిస్తున్నాడు. తాను తీసుకున్న వంద శాతం రుణాలను చెల్లిస్తామన్నా భారత్ వినే పరిస్థితిలో లేదు. సీబీఐ, ఈడీ సహా, మనీల్యాండరింగ్ కేసులు లిక్కర్ కింగ్ ను వెంటాడుతోన్న సంగతి తెలిసిందే.
ఈ కేసులో లండన్ కోర్టులో విచారణ ఎదుర్కోంటున్న మాల్యా తన రుణాలను మొత్తం చెల్లిస్తానన్నా, తన అభ్యర్దల్ని మాత్రం మన్నించాలని పలుమార్లు వేడుకున్న సంగతి తెలిసిందే. అయినా కనికరించలేదు. లిక్కర్ కింగ్ ను ఇండియా వచ్చినా..జైలు కు పంపించాలనే ప్రభుత్వం కంకణం కట్టుకుంది. తాజాగా లాక్ డౌనేపథ్యంలో మోదీ ప్రభుత్వం 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి సంక్షోభంలో కూడా తను తీసుకున్నరుణాలను తిరిగి చెల్లిస్తానని ప్రభుత్వాన్ని కాక పట్టే ప్రయత్నం చేసాడు. అలాగే సెటైర్లు కూడా వేసాడు.
కోవిడ్-19 ఉపశమన ప్యాకేజీపై ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నా. ఇక ప్రభుత్వం తాను కోరుకున్నంత కరెన్సీని ముద్రించుకోవచ్చు. కానీ తనలాంటి చిన్న చెల్లింపుదారుడు ప్రభుత్వ బ్యాంకుల రుణాలను పూర్తిగా చెల్లిస్తానన్నా ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడం న్యాయమా? తన అభ్యర్ధనను తొసిపుచ్చారని విమర్శించాడు. తాను ఇస్తానన్న నగదు తీసుకుని కేసు నుంచి తప్పించుకోవాలని చిలక పలుకులు పలికాడు.